YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆచితూచి కేసీఆర్ నిర్ణయం

ఆచితూచి కేసీఆర్ నిర్ణయం

ఆచితూచి కేసీఆర్ నిర్ణయం
హైద్రాబాద్, మే 15
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ పై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ ను మే నెల 29వ తేదీ వరకూ పొడిగించినా దీనిని మరోసారి పరిశీలించంేదుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమీక్ష చేయనున్నారు. అయితే లాక్ డౌన్ లో మరికొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారని సమాచారం. కానీ రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంంతో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్  సమీక్షించి మరోసారి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈరోజు అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించ నున్నారు. అయితే కేసీఆర్ మీడియా సమావేశం పెట్టే సమయానికి తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుతోంది. రోజుకు పదకొండు కేసులకు మించి నమోదు కావడం లేదు. కానీ గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.ప్రధానంగా ముంబయి నుంచి వచ్చిన వారితో కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న యాదాద్రి జిల్లాలో సయితం నాలుగు కేసులు నమోదయ్యాయయి. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ లో ఉన్నాయి. మిగిలిన జిల్లాలన్నీ దాదాపుగా ఆరెంజ్, గ్రీన్ జోన్ లకు రావడంతో కేసీఆర్ సయితం మరికొన్ని సడలింపులు ఇవ్వాలని అనుకున్నారు. కానీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.మరోవైపు తెలంగాణలో వైద్య పరీక్షలు కూడా తక్కువగా ఉన్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణలో కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మరికొన్ని కీలక నిర్ణయాలను కేసీఆర్ తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. మద్యం షాపులు తెరుచుకోవడం, నిబంధనల అమలుపై కూడా కేసీఆర్ ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. మద్యం విక్రయాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.

Related Posts