YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రెండు రాష్ట్రాలు... రెండు దార్లు

రెండు రాష్ట్రాలు... రెండు దార్లు

రెండు రాష్ట్రాలు... రెండు దార్లు
హైద్రాబాద్, మే 15,
అవిభక్త ఆంధ్రప్రదేశ్ విషయంలో జాతీయ పార్టీలు ఇరకాటంలో పడ్డాయి. తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్ తో ఇబ్బంది ఇవ్వకపోతే తెలంగాణ వాసులతో తంటా. దీన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ప్రయోగించింది. అన్ని పార్టీలను లేఖలు ఇవ్వాలంటూ నెపాన్ని అన్ని పార్టీలపై నెట్టేసి ఆ గేమ్ లో చివరికి తానే చిక్కుకుపోయి రెండు చోట్లా అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్. విభజించు పాలించు అన్ని చోట్లా పనికిరాదని విభజన వ్యవహారం జాతీయ పార్టీలకు ఒక గుణపాఠం లాంటిది. అయితే ఆ పాఠం బిజెపికి ఇంకా తలకెక్కనట్లే కనిపిస్తుంది. శ్రీశైలం డ్యామ్ నుంచి జల జగడం అంశంలో రెండు నాల్కల ధోరణి ఇప్పుడు కమలనాథులకు ముప్పు తెచ్చేలాగే వుంది.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు తోడటంపై ఎపి సర్కార్ నిర్ణయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అండగా నిలుస్తూ ప్రకటన చేశారు. ఏ మాత్రం వెనక్కు తగ్గద్దన్నది ఎపి బిజెపి మాట. సరే ఈ తీరుకు భిన్నమైన రీతిలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చర్యలు మొదలు పెట్టారు. టి సర్కార్ దక్షిణ తెలంగాణ కు అన్యాయం జరిగే చర్యలను చూస్తూ ఉరుకోమంటూ హెచ్చరించారు.అంతేకాదు ఆయన పార్టీ కార్యాలయంలోనే దీక్ష కూడా చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ సైతం రాసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం పెంచితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ బీజేపీ చెబుతుంది. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నది బీజేపీ నినాదం. ఇలా రెండు రాష్ట్రాల్లో బిజెపి స్టాండ్ రెండు రకాలుగా ఉండటం తో ఈ జలజగడం లో కేంద్రం వేలుపెడితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మరి దీనినుంచి కమలం అధిష్టానం ఎలా బయటపడుతుందో చూడాలి.

Related Posts