మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.
ఒంగోలు మే 15,
ఏపీలో మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన ఒంగోలు పేర్నమిట్టలోని మినోఫాం ఫార్మా కంపెనీలో జరిగింది. పరిశ్రమలో శానిటైజర్లు తయారు చేస్తుండగా.. ప్రమాదం సంభవించినట్టు ప్రాధమిక సమాచారం. శానిటైజర్లలో ఉపయోగించే ఆల్కహాల్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కంపేనీలో రెండు ఫోర్లకు దట్టమైన పొగలు వ్యాప్తించాయి. సిబ్బంది భయబ్రాంతులయి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేసారు. ప్రమాదంతో స్థానిక ప్రజలు భయానికి గురయ్యారు.