భారత్ కు బిలియన్ డాలర్ల సాయం
న్యూఢిల్లీ, మే 15,
కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ బ్యాంక్ మరోసారి భారీ సాయం ప్రకటించింది. భారత్‌కు ఒక బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.7500 కోట్లు) ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దేశంలోని పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. కరోనా అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం భారత్‌కు ప్రపంచ బ్యాంకు గతంలోనే ఒక బిలియన్ డాలర్ల సహాయానికి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా మరో బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించిందేశవ్యాప్తంగా అమలవుతున్న 400కు పైగా సామాజిక భద్రతా పథకాలను సాంకేతికంగా సమీకృతం చేసే దిశగా ఈ నిధులను వినియోగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి, చిన్నాభిన్నమైన పేద కుటుంబాలకు అండగా నిలవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర అభియాన్ భారత్’ పథకంపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింద నాటి ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వరల్డ్ బ్యాంకు డైరెక్టర్ (భారత్) జునైద్ అహ్మద్ తెలిపారు. ఆత్మ నిర్భర్ అభియాన్ పథకం కింద నిర్వచించిన విధివిధానాలు చాలా కీలకంగా ఉన్నాయని.. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా, పట్టణ ప్రాంతాల్లోనూ పేదలకు సామాజిక భద్రతను అందించటంలో ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇటు ప్రజల ఆరోగ్యానికీ, అటు జీవనోపాధికి సమాన ప్రాముఖ్యం ఇస్తోందని జునైద్ అహ్మద్ ప్రశంసించారు.