YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

జూలై నాటికి రఫెల్

జూలై నాటికి రఫెల్

జూలై నాటికి రఫెల్
ఆసియాలో అగ్రగామిగా భారత్
న్యూఢిల్లీ, మే 15,
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు జులై చివరి నాటికి భారత్‌కు అందనున్నాయి. తొలి దశలో నాలుగు విమానాలను ఫ్రాన్స్ అందజేస్తోంది. వాస్తవానికి మే నెల నాటికే రావాల్సి ఉండగా.. కరోనా వైరస్ తీవ్రతతో రెండు నెలలు వాయిదాపడింది. ‘రెండు సీట్ల సామర్థ్యం కలిగిన మూడు శిక్షణా విమానాలు, ఒక ఫైటర్ జెట్ మొత్తం నాలుగు రఫేల్ రకం ఎయిర్‌క్రాఫ్ట్స్ జులై చివరి నాటికి అంబాలా వైమానిక స్థావరానికి చేరుతాయి.. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలుకు భారత్ చేసుకున్న అతిపెద్ద రక్షణ ఒప్పందం ఖరారులో కీలక పాత్ర పోషించిన వైమానిక దళం చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా గౌరవార్థం విన్యాసాలు నిర్వహించనున్నారు’అని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.7 గోల్డెన్ యారోస్ స్క్రాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, ఫ్రాన్స్ పైలట్‌తో కలిసి తొలి యుద్ధ విమానాన్ని నడపడానికి సన్నహాలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు బయలుదేరిన తర్వాత మధ్య ఆసియాలో ఆగడానికి ముందు ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్ ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా గాలిలోనే వీటికి ఇంధనం నింపుతారు. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మరోసారి మార్గమధ్యలో భారత్ ఐఎల్-78 ట్యాంకర్ ద్వారా గాల్లోనే ఇంధనం నింపుతారని రక్షణ శాఖ వర్గాలు తెలియజేశాయి.రాఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు నేరుగా రానున్నాయి.. కానీ, లోపల కాక్‌పీట్ పరిమాణం చిన్నగా ఉండటంతో పది గంటల పాటు అందులో కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాయి. రాఫేల్ యుద్ధ విమానాలను నడిపే పైలట్లకు ఫ్రాన్స్‌లోనే శిక్షణ ఇస్తున్నారు. తొలి బ్యాచ్‌లో ఏడుగురు పైలట్లు శిక్షణ పూర్తి చేసుకోగా.. రెండో బ్యాచ్ లాక్‌డౌన్ తర్వాత అక్కడకు వెళ్లనున్నారు.లాక్‌డౌన్ తర్వాత గతవారం ఒక కార్గో విమానం ద్వారా రాఫేల్‌కు అవసరమైన పరికరాలను ఫ్రాన్స్ పంపంది. సమీప భవిష్యత్తులో మరిన్ని పరికరాలు రానున్నాయి. భారత వైమానిక దళం సామర్ధ్యాన్ని పెంచడానికి 36 రాఫెల్స్ విమానాలు కొనుగోలుకు 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో రూ .60,000 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకుంది.ఆ సమయంలో ఎయిర్ స్టాఫ్ ప్యూటీ చీఫ్‌గా ఉన్న ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే భదౌరియా.. ఈ ఒప్పందంలో భారత చర్చల బృందానికి నాయకత్వం వహించారు. విదేశాల నుంచి యుద్ధ విమానాలు కొనుగోలుకు భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇదే అతిపెద్దది. సుదూర ప్రాంతాల నుంచి క్షిపణులను, శత్రు విమానాలను నాశనం చేసే సామర్థ్యం వీటి సొంతం. సామర్ధ్యం విషయంలో పాక్, చైనా రెండింటిపై భారత్‌ పైచేయి సాధించనుంది.

Related Posts