YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

82 వేలు దాటేసిన కరోనా కేసులు

82 వేలు దాటేసిన కరోనా కేసులు

82 వేలు దాటేసిన కరోనా కేసులు
న్యూఢిల్లీ, మే 15,
దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 82వేలకు చేరవయ్యింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు 4వేల మందిలో కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. అలాగే మరో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 5న దేశంలో అత్యధికంగా 194 మంది కరోనాతో చనిపోగా.. ఆ తర్వాత ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మొత్తం మరణాల్లో 83% మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ల్లోనే చోటుచేసుకున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు.శుక్రవారం ఉదయానికి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 81,997కి చేరగా.. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,900పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే ఇది 5.01% ఎక్కువ. అయితే, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరగడం శుభపరిణామం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 27,969 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో మొత్తం 1,600 మందికిపైగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మొత్తం కరోనా బాధితుల్లో ఇది 34 శాతం. ముందురోజు ఈ రేటు 33.64%మేర ఉంది. అయితే, మృతుల రేటు కాస్త పెరగడం ఆందోళన కలిగించే అంశం. 3.25% నుంచి 3.26%కి పెరిగింది.వలస కార్మికుల రాక ఎక్కువగా ఉన్న బిహార్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో గడచిన 24గంటల్లో వందకుపైగా పాజిటివ్ కేసులు పెరిగాయి. తొలి దశ లాక్‌డౌన్‌ సమయంలో రోజుకు సగటున 18 మంది మరణించగా, రెండో దశకు అది 56కి చేరింది. ఇప్పుడు మూడో లాక్‌డౌన్‌ సమయంలో రోజుకు 106 మరణాలు సంభవిస్తున్నాయి. అయితే రోజువారీ సగటు మరణాల వృద్ధిరేటు తొలి లాక్‌డౌన్‌ సమయంలో 19.62% ఉండగా, తర్వాతి రెండు దశలకు వరుసగా 7.13%, 5.56%కి పడిపోయింది. ఇప్పటివరకూ సంభవించిన మరణాల్లో 38.25% ఒక్క మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. ఇక్కడ మరణాలు వెయ్యికి సమీపంలో ఉన్నాయి.గురువారం మహారాష్ట్రలో అత్యధికంగా 1,602 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తర్వాతి ఢిల్లీలో 472, తమిళనాడు 442, గుజరాత్ 324, మధ్యప్రదేశ్ 253, రాజస్థాన్ 206, ఉత్తరప్రదేశ్ 144, పశ్చిమ్ బెంగాల్ 87, ఆంధ్రప్రదేశ్ 68, తెలంగాణ 47 కేసులు నమోదయ్యాయి. మరోసారి కేరళలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం. మార్చి చివరివారం రోజుల తర్వాత అక్కడ రెండెంకల స్కోర్ నమోదయ్యింది. గురువారం 26 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. అత్యధికంగాకరోనా కేసులు నమోదయిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు (9,674) రెండో స్థానానికి చేరింది. దీని తర్వాత గుజరాత్ (9,592) ఉంది.మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 1,000 దాటింది. మొత్తం 1,019 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇందులో 55 శాతం రెండు వారాల్లోనే సంభవించాయి. గురువారం మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య 8,000 దాటింది. గురువారం నమోదయిన కేసులతో కలిపి మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య 8,470 దాటింది. ఢిల్లీలో కేసుల రెట్టింపు సమయం 11-12 రోజులకు చేరింది. మొత్తం 115 మంది ఢిల్లీలో చనిపోయారు

Related Posts