YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం దేశీయం

చైనా కట్టడికి అమెరికా వ్యూహం

చైనా కట్టడికి అమెరికా వ్యూహం

చైనా కట్టడికి అమెరికా వ్యూహం
న్యూఢిల్లీ, మే 15,
కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని డొనాల్డ్ ట్రంప్ బలంగా నమ్ముతున్న వేళ.. డ్రాగన్‌ను ఏకాకి చేసేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. భారత్‌తో సైనిక సంబంధాలను పెంచుకోవడం సహా 18 అంశాల ప్రణాళికను అమల్లో పెట్టాలని అగ్రరాజ్యం భావిస్తోంది. కరోనా విషయంలో చైనా అబద్దాలు చెప్పడం, వంచించడం, నిజాలను దాచి పెట్టడం వల్లే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోందని చెబుతున్న అమెరికా... దీనికి జిన్‌పింగ్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనంటోంది.చైనా నుంచి ఉత్పత్తి సంస్థలను బయటకు తరలించడంతోపాటు.. భారత్, వియత్నాం, తైవాన్ దేశాలతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై అమెరికా దృష్టి సారించనుంది. చైనాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అమెరికాని నిర్ణయించింది. అమెరికా టెక్నాలజీని చైనా చౌర్యం చేయకుండా.. తమ దేశ కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని.. చైనా హ్యాకింగ్ బారి నుంచి కాపాడుకోవడానికి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని 18 అంశాల ప్రణాళికలో పేర్కొన్నారు.చైనా తన సొంత ప్రజలను లేబర్ క్యాంపుల్లో ఉంచిందని.. అమెరికా టెక్నాలజీని, ఉద్యోగాలను చౌర్యం చేసిందని.. తమ మిత్రదేశాల సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించిందని.. 18 అంశాల ప్రణాళికను వెల్లడించిన సందర్భంగా సెనెటర్ థామ్ టిల్లిస్ ఆరోపించారు.అమెరికాకు, మిగతా ప్రపంచానికి ఇదో మేలుకొలుపు అన్న టిల్లిస్.. అమెరికా ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని, జాతీయ భద్రతను కాపాడుతూ.. చైనా ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలన్నారు.అమెరికా సైన్యం కోరుతున్న 20 బిలియన్ డాలర్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని.. భారత్, తైవాన్, వియత్నాంలకు ఆయుధాలను విక్రయించి సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఈ ప్లాన్‌లో పేర్కొన్నారు.అమెరికన్ల సొమ్ముతో చైనా తన అప్పులు తీర్చేయకుండా చూడాలని... చైనాకు చెందిన హువావే కంపెనీపై నిషేధం విధించాలని.. తమ మిత్రదేశాలు కూడా అదే బాటలో పయనించేలా చూడాలని ఈ ప్లాన్‌ సూచిస్తోంది. అభివృద్ధి చెందుతోన్న దేశాలకు అప్పులు ఇచ్చి చైనా బలవంతంగా లొంగదీసుకుంటున్న వైనాన్ని బయటపెట్టాలని టిల్లిస్ కోరారు.కరోనా వైరస్ గురించి అబద్దాలు చెప్పినందుకు, మానవ హక్కుల విషయంలో దారుణంగా వ్యవహరించినందుకు చైనా ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలని ఈ ప్లాన్ సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వతంత్రంగా వ్యవహరించేలా సంస్కరణలు తీసుకురావాలని టిల్లిస్ కోరారు

Related Posts