ఫార్మర్స్ కోసం…11 పాయింట్ ఫార్ములా.. నిర్మలా సీతారామన్
న్యూ ఢిల్లీ మే 15
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన మూడో ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు 13వ తేదీన సుమారు రూ.6లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించారు. 14వ తేదీన సుమారు రూ.3.4 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని వివిధ రంగాల కోసం ప్రకటించారు. ఈ రోజు మూడో ప్యాకేజీలోవ్యవసాయం వ్యవసాయ ఆధారిత రంగాలపై ప్రధాన ప్రకటన చేసారు. మొత్తం నేడు 11 చర్యలను ప్రకటించారు. అందులో 8 అంశాలు ప్రభుత్వం జరిపే ఆర్థిక కేటాయింపులు ఉన్నాయి.. మిగతా మూడు పాలనకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇందులో రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ ..అలాగే మత్స్య కారులకి ప్రత్యేక సాయం ఉండబోతుంది అని తెలిపారు
ఫార్మర్స్ …11 పాయింట్ ఫార్ములా..
దేశంలోనే రైతులను ఆదుకోవడానికి ఈ 11 పాయింట్ ఫార్ములా అని చెప్పిన కేంద్ర మంత్రి. లాక్ డౌన్ సమయంలో రైతుల నుంచి రూ . 74300 కోట్ల ధాన్యం కొనుగోలు చేశాం. పీఎం కిసాన్ ఫండ్ ట్రాన్స్ఫర్ కింద రైతుల ఖాతాల్లోకి రూ.18700 కోట్లు బదిలీ చేశాం. ఫసల్ బీమా యోజన కింద నష్టపోయిన రైతులకు రూ.6400 కోట్లు క్లెయిమ్లను క్లియర్ చేయడం జరిగింది . మొత్తంగా దేశంలో 85 శాతం మంది జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు అని తెలిపారు. పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకం .. రూ.5వేల కోట్లు కేటాయింపు !
లాక్ డౌన్ సమయంలో పాల డిమాండ్ 20 -25 శాతం తగ్గింది. సహకార సంఘాలు 560 లక్షల లీటర్ల స్థానంలో 360 లక్షల లీటర్లు మాత్రమే కొనుగోలు చేసారు. ఇక రైతుల నుంచి 111 కోట్ల లీటర్ల పాల సేకరణకు నాలుగు వేల ఒక వంద కోట్లు ఖర్చు చేశాం. డెయిరీ కోఆపరేటివ్స్కు 2020-21కి గాను 2శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. అలాగే రైతుల దగ్గర నుంచి పంటలు కొనుగోలు చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ముందుకొచ్చే స్టార్టప్లకు ఇతర సంస్థలకు రూ.1 లక్ష కోట్లు ఇస్తున్నాం. 2 కోట్ల మంది పాడిరైతులకు రూ.5వేల కోట్లు ప్రోత్సాహకం. పాల సేకరణ ద్వారా పాడి రైతులకు రూ.4100 కోట్లు మేలు చేకూర్చాం.
ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులకు ఊరట...
రైతుల కోసం ఒక లక్ష కోట్లతో మౌలిక వసతుల కల్పన. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్వల్పకాలిక రుణాలు. అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కోసం క్లస్టర్ లు తీసుకొస్తాం. వ్యవసాయానికి కేటాయించిన నిధుల నుంచి గోదాములు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం. గ్రామీణ ఆహారోత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధి. ఆహార పరిశ్రమలకు రూ.10వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాం.
మత్స్యకారుల కోసం రూ.20వేల కోట్లు ..!
మత్స్యకారులను ప్రోత్సహించేందుకు రూ.20వేల కోట్లు ఏర్పాటు చేస్తున్నాం. మత్సకార రంగంను ప్రోత్సహించేందుకు రూ.11వేల కోట్లు కేటాయిస్తున్నాం.. మరో రూ.9వేల కోట్లు హార్బర్ల అభివృద్ధి కోసం మండీల కోసం వినియోగిస్తాం. ఫిషరీస్ రంగంలో 55లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.జంతు సంరక్షణ కోసం రూ. 1333 కోట్లు !
పశువులు రోగాల బారిన పడకుండా నియంత్రించేందుకు లేదా రోగ నివారణకు 100శాతం వ్యాక్సినేషన్ తీసుకొస్తాం. 53 కోట్లు మేరా జంతువులకు వ్యాక్సినేషన్ చేయిస్తాం. జంతు సంరక్షణ కోసం రూ. 1333 కోట్లను కేటాయిస్తున్నాం. యానిమల్ హస్బెండరీ కార్యక్రమంలో భాగంగా డెయిరీ ఇండస్ట్రీలో ఎగుమతులు బాగున్నాయి కాబట్టి విదేశీ పెట్టుబడులు కూడా వస్తాయని ఆశిస్తున్నాం. ప్రస్తుతం పాల ఉత్పత్తి రంగం మన దేశంలో సంక్షోభంలో ఉంది. డెయిరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.15వేల కోట్లను కేటాయిస్తున్నాం.
హెర్బల్ వ్యవసాయం కోసం రూ.4వేల కోట్లు ..
హెర్బల్ వ్యవసాయంను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుకొస్తోంది. ఇందుకోసం రూ.4వేల కోట్లు కేటాయిస్తున్నాం. 10 లక్షల హెక్టార్లలో హెర్బల్ ఔషదాలు పెంచేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. తేనె పట్టు పరిశ్రమల కోసం రూ. 500 కోట్లు కేటాయించారు.