డీఎప్సీ ఆత్మహత్య
విశాఖపట్నం మే 15
విశాఖలో పోలీసు అధికారి ఆత్మహత్య కలకలం రేపింది.విశాఖలో అప్పుఘర్ సమీపంలో బీచ్ రోయల్ అపార్ట్ మెంట్ లో.. డిఎస్పీ కృష్ణ వర్మ స్పెషల్ బ్రాంచ్ అధికారి మృతి చెందారు.ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ కు పాల్పడిన ట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడు తున్నారని..ఎంవిపి పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ విశాఖ బీచ్ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆయనకు ఇటీవలే హార్ట్ ఆపరేషన్ కూడా అయ్యింది. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్లపాటు ఎస్ఐగా పని చేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.