YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
 జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య
ములుగు మే 15
 సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండి, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టర్, ఐటిడిఏ ఏటూర్ నాగారం పివో హన్మంత్ కే జెండగే తో కలిసి ఏరియా ఆసుపత్రి ములుగులో వైద్యాదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ సమయంలో ఏ విధమైన ఆరోగ్య సమస్యలతో రోగులు వచ్చినా చికిత్సకు సిద్దంగా వుండాలన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఆసుపత్రుల్లో అత్యవసర మందులు కావాల్సిన దానికి అదనంగా బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచాలన్నారు. గత సంవత్సరం నమోదైనా మలేరియా, డెంగ్యూ కేసులను దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్లడ్ బ్యాంక్ లో ప్రతి గ్రూప్ కు 500 బ్లడ్ ప్యాకెట్లు సిద్దంగా ఉండేట్లు చర్యలు తీసుకోవాలన్నారు. సెల్ కౌంటర్, అనలైజర్ లు కావాల్సిన మేరకు కొనుగోలు చేయాలన్నారు. ఏ.సి. లు, ల్యాబరేటరీ సామాగ్రి తదితరాలు మరమ్మత్తులు వుంటే పూర్తి చేయాలన్నారు. లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ల్యాబరేటరీలో రాబోయే 4 నెలలకు కావాల్సిన పరికరాలు, మందులు కొనుగోలు చేయాలన్నారు. గిరిజన సంక్షేమ డిఇ తో సమన్వయము చేసుకొని పార్కింగ్ షెడ్, నిరీక్షణ గదులు తదితర సివిల్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. కావాల్సిన మెడికల్ ఆఫీసర్లను మెరిట్ ప్రాతిపదికన నియమించుకోవాలన్నారు. గైనకాలజిస్ట్, పిడియాట్రిక్స్, స్పెషలిస్ట్ లను కాంటాక్టు ప్రాతిపదికన నియమించుకోవాలన్నారు. కలర్ డాప్లర్, వెంటిలేటర్, సి ఆర్మ్, నెబ్ లైజర్, ఐసియు మంచాలు, స్టెతస్కోప్లు, బిపి ఆపరేటర్స్, రిఫ్రిజిరేటర్లు, ఏ.సి.లు, ఓటి లైటింగ్, కోవిడ్ సాంపిల్ కలెక్షన్ బూత్, డిజిటల్ ఎక్స్ రే రీడర్ తదితర కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చుకోవాలని, నిధుల సమస్య లేదని అన్నారు. ప్రతి కొనుగోలు, నియామకంలో విధిగా నియమ నిబంధనలు పాటించాలన్నారు.  కావాల్సిన అన్ని సదుపాయాలు  కల్పిస్తామని అన్నారు.  ములుగు జిల్లా వెనుకబడిన జిల్లా అని, గిరిజన గ్రామాలతో గిరిజనులు ఎక్కువగా వున్నారని, రాబోయే సీజనల్ వ్యాధుల దృష్ట్యా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మెరుగైన సేవలు అందించి, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలని అన్నారు. అనంతరం ఆసుపత్రి లోపల, పరిసరాలు పరిశీలించారు. పార్కింగ్ షెడ్, నిరీక్షణ గది తదితర సివిల్ పనుల ప్రదేశాలు పరిశీలించారు. ఆసుపత్రి ప్రక్కన వున్న ముళ్ళ చెట్లను, అపరిశుభ్రతను వెంటనే తొలగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. అప్పయ్య, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. పి. జగదీశ్వర్, డిసిహెచ్ఎస్ డా. చందు నాయక్, ఆర్ఎంఓ డా. టి. సుజిత్, సిఎఎస్ డా. నారాయణ రెడ్డి, పాథలజిస్ట్ డా. శ్రవణ్, రేడియాలజిస్ట్ డా. కపిల్, ఇఎన్ టి డా. రాజేంద్రప్రసాద్, సైక్రియాటిస్ట్ డా. పట్టాభి రామా రావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts