YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

టెలీ మెడిసిన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

టెలీ మెడిసిన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

టెలీ మెడిసిన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
 జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య
ములుగు, మే 15
జిల్లాలో చేపట్టిన టెలీ మెడిసిన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో అన్నారు. శుక్రవారం ఏరియా ఆసుపత్రి ములుగు సందర్శనలో భాగంగా, ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన టెలీ మెడిసిన్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీ కన్సల్ట్ యాప్ ద్వారా టెలీ మెడిసిన్ సేవలను చేపడుతున్నట్లు తెలిపారు. వైద్య, స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీ శాఖల సమన్వయం తో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించామన్నారు. వైద్య సదుపాయం కొరకు వీరిని సంప్రదిస్తే, టీ కన్సల్ట్ యాప్ ద్వారా వైద్య నిపుణులచే ఆయా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో లభ్యమయ్యే మందులు సూచించనున్నట్లు ఆయన తెలిపారు. ఎంతో దూరం వచ్చి, సమయం, ఆర్థిక భారం పడకుండా టెలీ మెడిసిన్ ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చని కలెక్టర్ అన్నారు.     ఈ సందర్భంగా ఐటీడీఏ ఏటూరునాగారం పీవో హన్మంత్ కె జండగే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఏ. అప్పయ్య, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.

Related Posts