YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కసితీర్చుకుంటున్న విశ్వేశ్వరరెడ్డి

కసితీర్చుకుంటున్న విశ్వేశ్వరరెడ్డి

కసితీర్చుకుంటున్న విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం, మే 16,
పార్టీ ఏదైనా నాయ‌కుల వ్య‌వ‌హారం మాత్రం మార‌ద‌ని మ‌రోసారి రుజువైంది. రాష్ట్రంలో గ‌త ఐదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో టీడీపీ నేత‌లు ఓడిపోయిన చోట కూడా పార్టీ అధికారంలో ఉండ‌డంతో టీడీపీ నేత‌లే చ‌క్రం తిప్పారు. దీంతో గెలిచిన వైసీపీ నేత‌లు కూడా డ‌మ్మీలుగా మారిపో యారు. ఇక‌, ఇప్పుడు ఇదే సీన్ రివ‌ర్స్ అయింది. రాష్ట్రంలో 151 స్థానాల్లో వైసీపీ విజ‌యం సాధించింది. మిగిలిన స్థానాల్లో ఒక‌టి త‌ప్ప మిగిలిన చోట టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, ఇలా గెలిచిన స్థానాల్లోనూ ముగ్గురు నాయ‌కులు పార్టీకి త‌ట‌స్తంగా ఉన్నారు. ఇలా త‌ట‌స్థంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి బాగానే ఉన్నప్పటికీ.. టీడీపీలోనే ఉన్న నాయ‌కుల‌కు మాత్రం ఇప్పుడు చుక్కలు క‌నిపిస్తున్నాయి..గ‌తంలో వైసీపీ నేత‌ల‌ను తీవ్ర ఇక్కట్లు పాల్జేసిన టీడీపీపై ఇప్పుడు ఓడిపోయిన వైసీపీ నాయ‌కులు క‌సి తీర్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర‌రెడ్డి ముందు వ‌రుస‌లో ఉన్నార‌ని అంటున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో విశ్వేశ్వర‌రెడ్డి విజ‌యం సాధించారు. కానీ, ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన వైసీపీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆయ‌న ఆ ఐదేళ్లు బిక్కుబిక్కు మంటూ నే కాలం గ‌డిపారు. క‌నీసం ఓ ఎమ్మెల్యే హోదాలో కూడా ఆయ‌న‌కు గౌర‌వం లేకుండా చేశారు. అప్పుడు విశ్వేశ్వర్ రెడ్డిపై ఓడిపోయిన ప‌య్యావుల కేశ‌వ్‌కు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇవ్వడంతో కేశ‌వ్ ఆధిప‌త్యమే సాగింది.ఇక‌, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విశ్వేశ్వర‌రెడ్డి ఓడి పోయారు. ఇదే స్థానంలో టీడీపీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్ విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌ను చంద్రబాబు పీఏసీ చైర్మన్‌గా కూడా అవ‌కాశం క‌ల్పించారు. అయిన‌ప్పటికీ కూడా కేశ‌వ్‌కు చుక్కలు చూపిస్తున్నార‌ట విశ్వేశ్వర‌రెడ్డి. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌తో విశ్వేశ్వర‌రెడ్డికి చాలా చ‌నువు ఉన్న కార‌ణంగా.. నియోజ‌క‌వ‌ర్గంలో తాను ఓడిపోయినా.. పార్టీ అధికారంలో ఉండ‌డంతో అంతా తానై వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌. అంతేకాదు, జ‌గ‌న్ కూడా విశ్వేశ్వర‌రెడ్డికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అంటున్నారు.ప‌య్యావుల‌ను పీఏసీ చైర్మన్ చేయ‌డంతో విశ్వేశ్వర‌రెడ్డికి ప్రాధాన్యం పెరిగింద‌ని, అన్ని కార్యక్రమాల‌కూ విశ్వేశ్వర్ రెడ్డి మాత్రమే హాజ‌ర‌వుతున్నార‌ని, అదే స‌మ‌యంలో ఆయ‌న చేతుల మీదుగానే పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. ప‌య్యావుల ఇటీవ‌ల ఓ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయ‌త్నించిన‌ప్పుడు కూడా పోలీసులు అడ్డుత‌గిలారు. అయితే, అదేస‌మ‌యంలో విశ్వేశ్వర‌రెడ్డి స‌ద‌రు కార్యక్రమం పూర్తి చేశారు. అస‌లు ప్రతిప‌క్షంలో ఉన్న టీడీపీ నేత‌ల‌కు ఒక్క ప‌ని కూడా కావ‌డం లేద‌ట‌. ఇది ఒక ఎత్తు అయితే ప‌య్యావుల సొంత పంచాయ‌తీని మూడు ముక్కలుగా చేయ‌డం ఖాయ‌మైంది. ఇది ప‌య్యావుల‌కు ఇష్టం లేక‌పోయినా ఆయ‌న్ను దెబ్బకొట్టేందుకే విశ్వేశ్వర్ రెడ్డి ఈ ప్రక్రియ విజ‌య‌వంతంగా పూర్తి చేశార‌ట‌. ఏదేమైనా విశ్వేశ్వర్ రెడ్డి ఇలా టీడీపీ ఎమ్మెల్యేపై ఆధిప‌త్యాన్ని పూర్తిగా ప్రద‌ర్శిస్తు గ‌త ఐదేళ్లల‌కు త‌న‌కు జ‌రిగిన ప‌రాభ‌వానికి రివేంజ్ తీర్చుకుంటున్నార‌న్న చ‌ర్చలు న‌డుస్తున్నాయి.

Related Posts