YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పల్లె వెలుగు బస్సుల్లోనూ..మార్పులు

పల్లె వెలుగు బస్సుల్లోనూ..మార్పులు

పల్లె వెలుగు బస్సుల్లోనూ..మార్పులు
తిరుపతి, మే 16,
ముంచుకొస్తున్న కరోనా ముప్పుతో ప్రజల ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వ ఖజానాలు బోసిపోయాయి.  ఈనేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా గ్రామాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులో 30 మంది వరకే ఎంట్రీ ఇస్తున్నారు.  ఈమేరకు సీటింగ్ మార్పులు శరవేగంగా సాగుతున్నాయి.  సుదీర్ఘ విరామం తరువాత ఈ నెల 18 నుంచి బస్సులు నడిపేందుకు పౌర రవాణా శాఖ  సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే బస్సులను రోడ్డెక్కించడానికి సన్నద్ధం అవుతోంది.కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం వుండేలా బస్సుల సీటింగ్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది. అదేవిధంగా ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌, లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌ అందుబాటులో ఉంచనున్నది. కానీ పల్లె వెలుగు బస్సుల్లో సీట్లను మార్చడం లేదు. అయితే 50 సీట్లకుగాను 30 సీట్లలో మాత్రమే ప్రయాణికులు కూర్చోవాలి. ఈ మేరకు ఆయా బస్సుల్లో మార్కింగ్‌ చేయిస్తున్నారు.బస్సుల్లో నిల్చుని ప్రయాణించడానికి అనుమతించరు. పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లు ఉండరు. డ్రైవర్ల వద్ద టిమ్స్‌ ఉంటాయి. బస్టాండ్‌లో బస్సు ఎక్కే ముందే అక్కడ వుండే సిబ్బంది టిమ్స్‌తో టిక్కెట్లు జారీచేస్తారు. గతంలో మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపరు. లిమిటెడ్‌ హాల్ట్స్‌ మాత్రమే ఉంటాయి. ప్రజారవాణా ప్రారంభం అయితే కరోనా వ్యాప్తి పెరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా కరోనా కట్టడి జరుగుతుందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. మరోవైపు తొలివిడతగా హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు నడవనున్నాయి.  ఈబస్సుల్లోనూ సీట్లు మార్చారు. లాక్‌డౌన్ ప్రభావంతో హైదరాబాద్‌లో ఇరుక్కుపోయిన ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేసింది.  ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి వచ్చేవారు  ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.అయితే, స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే, వారికి టికెట్లు జారీ చేయనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లకు ఆదేశాలు పంపారు. ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్‌ ఏసీ బస్సుల్లో సూపర్‌ లగ్జరీ ఛార్జీ వసూలు చేస్తారు. తొలిదశపై వచ్చిన అభిప్రాయాలు, స్పందనను పరిగణనలోకి తీసుకుని . రెండో దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండిపోయిన ఏపీకి చెందిన వారిని తీసుకొచ్చేందుకు సర్వీసులు నడుపుతారుఅది కూడా పంచాయతీలో జనాభా ప్రాతిపదికనే ఈ దందాకు ఒక పరిధిని కూడా సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఉదాహరణకు 1500 ఓటింగ్ ఉన్న పంచాయతీలో గరిష్టంగా పదిలక్షలకు మించకుండా ఈ దోపిడీకి లిమిట్ పెట్టుకున్నారు. ఆపై జనాభా పెరిగేకొద్దీ తమ దోపిడీ పరిధిని పెంచుకున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే మొత్తంలో తాము సృష్టించిన కౌలు రైతుకి రెండు వేలలోపే చేతిలో పెట్టి మిగతా పదివేలను వాలంటీర్లు, నేతలు కలిసి పంచుకుంటున్నారట. ఒకవేళ కౌలు రైతులుగా సృష్టించిన వారు అడ్డం తిరిగినా.. అసలైన యజమానులుగా ఉన్న భూ పట్టాదారులు విషయం తెలుసుకొని వాలంటీర్లను నిలదీసినా బెదిరింపులు షరామామూలే. పెన్షన్ల నుండి అమ్మ ఒడి వరకు అన్నీ తమ చేతుల్లోనే ఉన్నాయని.. ఫిర్యాదులు అంటూ అధికారుల వరకు వెళ్తే మిగతా పథకాలు అందకుండా చేస్తామని నేతలతో కలిసి వాలంటీర్లు బెదిరింపులకు కూడా వెనకాడడం లేదని చెప్తున్నారు.  ఇది రాష్ట్రంలో ఒక్క జిల్లాకో ఒక మండలానికో పరిమితం కాలేదని తెలుస్తుంది. సీఎం సొంత జిల్లా కడప నుండి రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఈ దోపిడీ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మిగతా జిల్లాలలో కూడా ఈ దందా కొనసాగుతున్నా కాస్త ఆలస్యంగా మొదలైనట్లుగా తెలుస్తుంది. ఈ అక్రమాలపై ఇప్పటికే వ్యవసాయ అధికారులతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీఓలకు కూడా పలుచోట్ల ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తుంది.అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ ముమ్మరంగా ఉన్నందున విచారణ చేయలేమని.. పరిస్థితులు చక్కబడిన తరవాత విచారణకు ఆదేశిస్తామని చెప్తున్నారు. అయితే.. అధికార పార్టీ నేతలు, ప్రభుత్వంలో భాగమైన వాలంటీర్లను ప్రభుత్వ అధికారులు ఆదేశించే పరిస్థితి రాష్ట్రంలో లేదని బాధితులు వాపోతున్నారు. కౌలు రైతులకు ఇచ్చే భరోసాలో కేంద్రం వాటా కూడా లేదని తమ ప్రభుత్వమే ఈ డబ్బు ఇస్తుందని.. తమదే రాజ్యమన్నట్లుగా వీరి మాటలు ఉండడం విశేషం.పారదర్శకత.. అవినీతి నిర్మూలన అని చెప్పే సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాలో అవకతవకలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంక్షేమ పథకాల అమలు, పారదర్శకత కోసమే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ అవినీతికి వాలంటీర్లు ఆద్యులుగా మారుతున్నారు. ఇప్పటికే గతఏడాది సెప్టెంబర్, నవంబర్ నెలల్లోనే ఈ ఆరోపణలు వినిపించినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు అది కాస్త కుంభకోణం స్థాయికి చేరింది. మరి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? అన్నదే ప్రశ్న!

Related Posts