YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ భవిష్యత్తుపై ఆందోళన

టీడీపీ భవిష్యత్తుపై ఆందోళన

టీడీపీ భవిష్యత్తుపై ఆందోళన
విజయవాడ, మే 16
చంద్రబాబు బాధ ప్రపంచ బాధ కాదు, అది పూర్తిగా ఆయన రాజకీయ జీవితం బాధ. నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ కెరీర్ ఓ వైపు ముగిసిపోతోంది. మరోవైపు చూస్తే తెలుగుదేశంలో భవిష్యత్తు వారసత్వం లేదు. ఇక మరో నాలుగేళ్ళ పాటు సుదీర్ఘ నిరీక్షణ తరువాత అయినా ఫేట్ మారుతుందా, సీటు దక్కుతుందా అంటే బాబుకే నమ్మకం చిక్కని పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం చంద్రబాబు ప్రతీ దాన్ని చుట్టేస్తూ మసాలా దట్టిస్తూ జగన్ మీద బండలు వేస్తున్నారు. ఆయన ప్రస్తుత రాజకీయ స్థితి. నేపధ్యం నుంచి చూసి మాత్రమే ఆ బాధను అర్ధం చేసుకోవాలి. లేకపోతే చంద్రబాబు ఏంటి ఇలా అయిన దానికీ, కాని దానికీ విమర్శలు చేస్తున్నారు అనుకోవాల్సివస్తోంది.ఇక జగన్ వైపు చూస్తే చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఆయనకు అన్నింటికీ మించి వయసు ఉంది. మరో మూడు దశాబ్దాల పాటు చురుకుగా రాజకీయం చేస్తే అవకాశం ఉంది. ఇక ఇపుడు బంపర్ మెజారిటీతో గెలిచారు. ఒకవేళ జనాలకు ఎంతో కొంత మొహం మొత్తినా కూడా ఇపుడు వచ్చిన వాటిలో యాభై సీట్లు పోయినా కూడా వంద సీట్లు అయినా వైసీపీకి దక్కుతాయి. అంటే మళ్ళీ ఆయనే సీఎం అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది. మరో వైపు చూస్తే పదేళ్ల పాటు ఏ అధికారం అండా లేకుండానే ఏపీ రాజకీయాన్ని రఫ్ ఆడించేసిన జగన్ కి చేతిలో అధికారం ఉంచుకుని 2024 ఎన్నికల్లో బరిలోకి దిగితే తట్టుకోవడం ప్రత్యర్ధి చంద్రబాబుకి చాలా కష్టమే. అదే రాజకీయాల్లో పండిపోయిన బాబుకు అతి పెద్ద బాధగా ఉందిట.జగన్ ని అయిదేళ్ళూ ముఖ్యమంత్రి సీట్లో ఉంచితే ఆయన కచ్చితంగా బలోపేతం అవుతారు. ఎన్నికల వేళకు అన్నీ సర్దుకుని జనామోదానికి రెడీ అయిపోతారు. ఇక రాజకీయంగా పట్టుని కూడా పూర్తిగా సంపాదిస్తారు. జగన్ తొలి ఏడాది పాలనలో తడబాట్లు,పొరపాట్లు ఉన్నాయి. అయితే వాటి నుంచి ఆయన అనుభవం కూడా సంపాదిస్తున్నారు అన్నది రెండో వైపు వినిపించే మాట. రాళ్ళ దెబ్బలు తగులుతూంటే రాటుదేలడం జగన్ కి పదేళ్ళుగా అలవాటు అయిన విద్యగా ఉంది. ఇక అన్ని కష్టాలు ఆయనకు తొలి ఏడాదే వచ్చేశాయి. కరోనా వంటి ప్రపంచ విపత్తుని కూడా జగన్ డీల్ చేస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ కలసి జగన్ ని తిరుగులేని మొనగాణ్ణి చేస్తే ఎదురు నిలవడం కూడా టీడీపీకి కష్టమైపోతుంది. పైగా ఇప్పటికే అన్ని విధాలుగా కునారిల్లిన టీడీపీకి గత వైభోగమే తప్ప భవిష్యత్తుపై అంచనాలు అడుగంటుతున్నాయి.ఇక్కడో విషయం చెప్పుకోవాలి. 2024 ఎన్నికలు అంటే చంద్రబాబుకు కచ్చితంగా చివరి ఎన్నికలు, దానికి ప్రాతిపదికగా 2019 ఎన్నికలు ఉన్నాయి. 2019లో చంద్రబాబు గెలిస్తే ఆ లెక్క వేరేగా ఉండేదేమో కానీ ఓడిపోవడం వల్ల మాత్రం జగన్ కి అన్ని రకాలుగా కలసివచ్చింది. నిజానికి ఈ ఎన్నికలతోనే బాబు పార్టీ పని చాలా వరకూ అయిపోయిందన్న విశ్లేషణలూ ఉన్నాయి. అయితే బలమైన పార్టీ, నాయకుడు చంద్రబాబు కాబట్టి మరో ఎన్నిక వరకూ అవకాశం ఉందేమోనని వీరాభిమానుల ఆశగా ఉంది. చంద్రబాబు కూడా ఉన్న శక్తి కూడగట్టుకుని 2024కి పోరాడాలని ప్రతీ రోజూ పరితపిస్తున్నారు. అయితే గత ఏడాదిగా ఆయనకు పెద్దగా ఎక్కడా కలసిరావడంలేదు. దాంతో 2024లో చివరి పోరాటం లో జగన్ కనుక మళ్ళీ విజేత అయితే టీడీపీ సంగతేంటన్న ప్రశ్న కూడా ఇప్పటి నుంచే పార్టీ వర్గాలో పట్టుకుంది. చంద్రబాబుకు ఫైనల్ చాన్స్ ఇవ్వాలా, లేక 2023 నాటికే ఫైనల్స్ తో గేమ్ ముగించేయాలా అన్నది ఇపుడు జగన్ చేతిలోనే ఉంది. ఆయన దూకుడూ, ఆలోచనలూ కూడా ఆ దిశగానే సాగడంతోనే చ్రందబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చూడాలి మరి ఆఖరి పోరాటానికి ముహూర్తం ఎపుడో.

Related Posts