ఆర్టీసీ కార్గోలో ఎరువులు, ధాన్యాలు
హైద్రాబాద్, మే 16,
ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తెలంగాణ సర్కారు వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్టీసీ కార్గో సర్వీసులకు పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. లాక్‌డౌన్ వేళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కార్గో సర్వీసుల ద్వారా కొనుగోలు కేంద్రాల నుంచి నిల్వ కేంద్రాలకు తరలించడానికి ఆర్టీసీ కార్గో సేవలను ఉపయోగించుకుంటోంది. ఎరువుల రవాణాకు కూడా కార్గో సేవలను ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రతి కార్గోలో 8 నుంచి 9 టన్నుల సామర్థ్యం ఉన్న ఎరువులను రవాణా చేసే వీలుంది. కార్గో ద్వారా కామారెడ్డి జిల్లాలో ఎరువుల సరఫరా.. ఖమ్మం, వరంగల్ రూరల్ జిల్లాల్లో మొక్కజొన్న రవాణాను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలోనూ ధాన్యం బస్తాలను ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా తరలించారు.