కేదర్ నాధ్, బదరీనాధ్ లలో నో ఎంట్రీ
న్యూఢిల్లీ, మే 16,
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతబడ్డాయి. తాజాగా ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. వేద మంత్రాలతో ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. పూజారులు లోపలికి ప్రవేశించి, ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన పూజారితో సహా మొత్తం 28 మంది మాత్రమే ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు బద్రీనాథుని సన్నిధిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ఆదేశాల మేరకు భక్తులను ఎవరినీ ఆలయంలోకి అనుమతించడం లేదని చమోలీ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అనిల్ ఛన్యాల్ తెలిపారు. శీతాకాల విరామం తరువాత ఏప్రిల్ 29న మొదట ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే కరోనా కారణంగా ఏ యాత్రికుడిని ఆలయంలోకి అనుమంతించలేదు. యత్రికులు లేకుండానే పంచముఖి డోలీ యాత్ర నిర్వహించారు. గత సంవత్సరం ఆలయం తెరిచిన మొదటి రోజు10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తాజాగా భక్తుల ప్రవేశానికి అవకాశం లేదు. ఇటు కేదార్ నాథ్ ఆలయం కూడా గత నెల 20వ తేదీన తెరుచుకుంది. ఉత్తరాఖండ్‌లో కరోనా లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో కేదార్‌నాథ్ ఆలయంలో... ఆలయ కమిటీ సభ్యులు, పాలనాధికారులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరున మొదటి పూజ జరిపారు. సుందర. సుమధుర పుష్పాలంకరణతో ఆలయం సర్వాంగ సుందరంగా ఉంది. 10 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించడంతో... శ్వేత వర్ష ప్రపంచంలో అరుణ కాంతులతో విరాజిల్లుతోంది. ఛార్‌ధామ్ యాత్రలో భాగంగా... కేదారేశ్వర స్వామి ఆలయానికి పంఛముఖి డోలీ యాత్రను నిర్వహించారుఆర్మీలోని కుమావో బెటాలియన్ ఏటా దీన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏటా ఈ యాత్రలో వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొంటుంటారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఐదుగురే పాల్గొనాల్సి వచ్చింది. కేదార్ నాథ్ ఆలయానికి పంచముఖి స్వామి వారిని... పల్లకీలో మోసుకెళ్లారు. చార్ ధామ్ గా ప్రసిద్ధి చెందిన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు తిరిగి తెరుచుకోవడం శుభసూచకం. కరోనా మహమ్మారి నుంచి బయటపడి దేశంలోని ఆలయాలన్నీ తిరిగి తెరుచుకోవడం ప్రారంభం కావాలని భక్తులందరూ కోరుకుంటున్నా,రు.