YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రూ.25కోట్ల ఎర్ర మట్టిని దోచేసారు

రూ.25కోట్ల ఎర్ర మట్టిని దోచేసారు

రూ.25కోట్ల ఎర్ర మట్టిని దోచేసారు
నందిగామ రూరల్ మే 16,
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని ముఖ్యమైన వైకాపా నాయకులు అక్రమ ఇసుక, అక్రమ ఎర్రమట్టి తవ్వకాలపై కన్నేసారని, పల్లగిరి, రాఘవాపురం, పెద్దవరం గ్రామాలలో వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రమట్టి కొండల్ని రెండు చేతులతో బొక్కేస్తున్నారని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ధ్వజమెత్తారు. ఏడాది కాలంలోనే రూ.25కోట్ల మేర అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు జరిగినట్లు ఆరోపించారు.   ఏలాంటి అనుమతులు లేకుండా భారీ ప్రొక్లెనర్లు పెట్టి, లారీలు ట్రాక్టర్లతో పలు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆమె దుయ్యబట్టారు.   ఎర్రమట్టి తవ్వకాలపై అధికారులకు గతంలో ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా నాలుగు లారీలపై కేసులుపెట్టి దొడ్డిదారిన వెంటనే విడుదల చేసారని ఆరోపించారు.   మట్టి తవ్వకాలపై అనుమతులు చూపించమని అడుగుతున్నా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు.   కొండ పోరంబోకు భూముల్లో వ్యవసాయం చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బిసీ కులాలకు చెందిన రైతులను బెదిరించి లొంగదీసుకుంటున్నారని పేర్కొన్నారు.   నియోజకవర్గంలో ఇసుక దోపిడీకి అంతే లేదని, ఒక్కో లారీ లక్షల రూపాయల్లో సుదూర ప్రాంతాలకు రాత్రికి రాత్రి తరలించేస్తున్నారని ఆమె వివరించారు.   ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు తక్షణం స్పందించకపోతే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆందోళనలను ఉధృతం చేస్తుందని ఆమె హెచ్చరించారు.

Related Posts