YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆదివారం తో ముగియనున్న లాక్ డౌన్ 3.0..ఎల్లుండి నుంచి ఇలా..

ఆదివారం తో ముగియనున్న లాక్ డౌన్ 3.0..ఎల్లుండి నుంచి ఇలా..

ఆదివారం తో ముగియనున్న లాక్ డౌన్ 3.0..ఎల్లుండి నుంచి ఇలా..
న్యూఢిల్లీ మే 16,
శవ్యాప్తంగా అమల్లో ఉన్నమూడో విడత లాక్ డౌన్ ఆదివారంతో  ముగియనుంది  కాగా, నాలుగో విడత లాక్డౌన్ అమలుకు కేంద్రం సమాయత్తమవుతోంది.. నాలుగో విడత లాక్ డౌన్లో  మరిన్ని సడలింపులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిమిత ఆంక్షలతో రవాణా సదుపాయాలను పునరుద్ధరించే అవకాశం ఉంది. జోన్లను నిర్దారించే అవకాశం రాష్ట్రాలకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. హాట్ స్పాట్లు, భౌతిక దూరం అమలు, విద్యాసంస్థలు  మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టేందుకు అవకాశాలు ఇవ్వాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. ఈ క్రమంలో కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.మే 18 నుంచి లాక్డౌన్ 4.0 అమల్లోకి రానుంది. ఈ సారి లాక్ డౌన్లో మరిన్ని సడలింపులు లభించే అవకాశం ఉందనే సమాచారం అందుతోంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనుండగా, రెడ్జోన్, కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కఠినంగా ఉండే అవకాశాలున్నాయి. మొత్తం జిల్లానే గ్రీన్ జోన్ గా ప్రకటించకుండా కేవలం ప్రభావిత ప్రాంతాన్నే కంటైన్ మెంట్ చేయాలని రాష్ట్రాలు కోరాయి.  గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను నిర్ధారించే అధికారం కూడా కేంద్రం రాష్ట్రాలకే అప్పగించనున్నట్లు కేంద్ర వర్గాల సమాచారం. ఇక స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లు మూసివేత కొనసాగనుండగా, పరిమితంగా  రైళ్లు, బస్సులు, విమానాలను నడిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే, ఆటోలు, టాక్సిలు, ప్రజా రవాణ ప్రారంభం కావచ్చు. కానీ  పరిమిత సంఖ్యలో ప్రయాణిలకు వుండనున్నారు. జిల్లాల మద్య రవాణ కు అనుమతి రావచ్చు. అయితే కేవలం అనుమతి పత్రాలున్నావారికే రాష్ట్రం దాడి వెళ్లే అవకాశం వుండవచ్చు.

Related Posts