సార్స్కోవ్2 పై ఐ.సి.ఎం.ఆర్. భారతదేశ వ్యాప్త సర్వే
న్యూ ఢిల్లీ మే 16
కమ్యూనిటీ-ఆధారిత జిల్లా స్థాయి సెరో-నిఘాను నిర్వహించడానికి, సాధారణజనాభాలో సార్స్కోవ్2 సంక్రమణప్రసారాన్నిపర్యవేక్షించడానికి, ఐ.సి.ఎం.ఆర్. భారతదేశవ్యాప్తసర్వేనుప్రారంభించింది. ఇందుకోసం తెలంగాణలోమూడుజిల్లాలుజనగావ్, కామారెడ్డి, నల్గొండ జిల్లాలను ఎంపిక చేశారు. ప్రతియీ జిల్లాలో 10 గ్రామాలను అక్కడక్కడా ఎంపికచేస్తారు. అధ్యయనంకోసం 18 సంవత్సరాల వయస్సు పైబడిన 40 మందిపెద్దవారినికవర్చేస్తారు. అవే గ్రామాల్లో 4 రౌండ్లలో అధ్యయనంజరుగుతుంది. (క్రాస్సెక్షనల్అధ్యయనంపునరావృతం వుతుంది ). సమాజంలో సార్స్కోవ్ సంక్రమణయొక్క సెరోప్రాబల్యంనిర్ణయించడానికి , ప్రారంభ సర్వే ఒకప్రాధమిక సమాచారంగా ఉపయోగపడుతుంది, కాగా, సమాజంలో సంక్రమణ పోకడలను పర్యవేక్షించడానికి తరువాతి రౌండ్లు సహాయపడతాయి. కమ్యూనిటీస్థాయిలో కోవిడ్-19 సంక్రమణ భారాన్ని నిర్ణయించడానికి మరియు సార్స్-కోవ్-2 సంక్రమణ ప్రసారంలో ఉన్న పోకడలను పర్యవేక్షించడానికి జనాభా ఆధారిత సెరో- సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన అధ్యయనాలు మనకు సహాయపడతాయి. తగిన నియంత్రణ చర్యల రూపకల్పన మరియు అమలులో మార్గనిర్దేశం చేయడానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయి. సాధారణ జనాభా మరియు ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో సార్స్-కోవ్ సంక్రమణ సెరోప్రాబల్యంయొక్క ధోరణిని అంచనా వేయడం మరియు పర్యవేక్షించడం, సార్స్-కోవ్-2 సంక్రమణకు సామాజికజనాభాప్రమాద కారకాలను నిర్ణయించడం మరియు సాధారణ జనాభా మరియు హాట్ స్పాట్ నగరాల్లో సంక్రమణ యొక్క భౌగోళిక వ్యాప్తిని వివరించడం ఈ సెరో-నిఘా యొక్క లక్ష్యాలు.ఇందుకోసం, జాతీయపౌష్టికాహారసంస్థ (ఎన్.ఐ. ఎన్) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మూడు జిల్లాల్లోని 30 గ్రామాల్లో ఇంటింటి సర్వేను ప్రారంభించింది.