YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

చైనా నుండి భారత్ కి తరలి వస్తున్న భారీ కంపెనీలు ..!

చైనా నుండి భారత్ కి తరలి వస్తున్న భారీ కంపెనీలు ..!

చైనా నుండి భారత్ కి తరలి వస్తున్న భారీ కంపెనీలు ..!
న్యూ ఢిల్లీ మే 16
ఒక్క మహమ్మారి ..ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై ఈ విదంగా ప్రభావం చూపిస్తుంది అని ఎవరు కలలో కూడా ఉహించి ఉండరు. కానీ ఈ వైరస్ దెబ్బకి ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వైరస్ దెబ్బకి అల్లాడిపోతోంది అంటేనే అర్థం చేసుకోవచ్చు ..ఈ వైరస్ ప్రభావం ఏ విధంగా ఉందొ. ఈ  వైరస్ పుట్టుక వ్యాప్తి కట్టడి విషయంలో చైనా యావత్ ప్రపంచాన్ని మోసగించిందనే అభిప్రాయం రోజురోజుకి మరింతగా బలపడుతున్న నేపథ్యంలో .. ఆ దేశం నుంచి బయట పడాలని పలు భారీ కంపెనీలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసాయి. ఇప్పటికే అమెరికా అధినేత ట్రంప్ ..అమెరికాకి చెందిన కంపెనీలు అన్ని వెనక్కి వచ్చేస్తాయి అని తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అమెరికన్ భారీ కంపెనీలు చైనా నుండి వెళ్తున్నట్టు ప్రకటించాయి. తాజాగా ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ అయిన లావా ఇంటర్నేషనల్ చైనాకి గుడ్ బై చెప్పింది. చైనాలోని తమ ఆఫీసులని భారత్ కి మార్చబోతున్నట్టు ప్రకటించింది. దీనితో వచ్చే ఐదేళ్ల కాలంలో ఇండియా లో రూ. 800 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు తెలిపింది. చైనా నుండి బయటకి వెళ్తున్న కంపెనీలకి భారత్ మరో మార్గంగా కనిపిస్తుంది. అలాగే  ఒకవైపు లాక్ డౌన్ కారణంగా కుప్పగూలిపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయటం మరోవైపు కొత్తగా పెట్టుబడులతో దేశంలోని వచ్చే కంపెనీలకు భారీగా భూములు కేటాయించడం అనే జంట లక్ష్యాలతో భారత కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రప్రభుత్వాలని అప్రమత్తం చేస్తూ విదేశీ కంపెనీలని ఆకర్షిస్తుంది. దీనితో ఇటీవలే కేంద్రం విడుదల చేసిన విధాన నిర్ణయాలు బాగున్నాయి అని తెలిపిన లావా అధికారులు ఇక నుండి భారత్ లో తయారు చేసిన మొబైల్ ఫోన్ లను చైనా కి ఎగుమతి  చేస్తాం అని ప్రకటించారు. విదేశాల నుంచి ప్రత్యేకించి చైనా నుంచి తరలి వచ్చే విదేశీ కంపెనీలకు పదేళ్లపాటు పన్ను విరామం ఇచ్చేందుకు కూడా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దీనితో మరిన్ని కంపెనీలు భారత్ కి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

Related Posts