దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయండి
బేతంచర్ల కంటైన్మెంట్ జోన్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్.
కర్నూలు, మే 16
కరోనా పాజిటివ్ కేసు నమోదైన బేతంచర్ల లో మండలం కొత్త బస్టాండ్ తహసీల్దార్ కార్యాలయం వీధి మరియు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వెళ్లే దారి వీధులలోని కంటైన్మెంట్ జోన్ లో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా శనివారం మధ్యాహ్నం పర్యటించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ, ముంబై ఇతర రాష్ట్రలు, ఇతర జిల్లాల నుంచి ఎంత మంది వచ్చారు, వెళ్లోచ్చిన వారిని ఎంత మందికి ట్రేసింగ్ చేశారని మెడికల్, పోలీస్, రెవెన్యూ అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అలా వచ్చి ఉంటే 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసు వచ్చిన 24 గంటల్లోపు కాంటాక్టు ట్రేసింగ్ అండ్ టెస్టింగ్, హోమ్ ఇషోలేషన్ చేసి త్వరితగతిన వైద్య సేవలను అందించాలని సూచించారు. కరోనా నివారణ కోసం అధికారులు అప్రమత్తంగా ఉంటూ సేవలు అందించాలన్నారు. కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. ప్రధానంగా కంటైన్మెంట్ జోన్ లో పర్యటిస్తున్న వాలంటీర్లు, ఆశ, ఏఎన్ఎంలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్ లో ప్రజలెవరూ బయటకు రాకుండా వారికి కావలసిన నిత్యావసర సరుకులను వారి ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయాలన్నారు. ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారితో పాటు 60 సంవత్సరాలు పైబడిన వారికి ప్రత్యేకంగా కరోనా నిర్ధారణ పరీక్షలు వెంటనే చేయాలన్నారు*