YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం

అమెరికా, చైనా

అమెరికా, చైనా

అమెరికా, చైనా
కరోనా ఫైట్
న్యూఢిల్లీ, మే 16
కరోనా వైరస్ కారణంగా అమెరికా, చైనాల మధ్య రాజుకున్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. చైనా విషయంలో ట్రంప్ తెంపరితనం చూపుతుంటే.. డ్రాగన్ కూడా వెనక్కుతగ్గబోనంటోంది. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్న వేళ.. చైనా చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతోంది. ఐక్యరాజ్య సమితికి వివిధ దేశాలు చెల్లించాల్సిన 2 బిలియన్ డాలర్ల బకాయిలను గుర్తుచేసిన డ్రాగన్... వీలైనంత త్వరగా సభ్యదేశాలు వీటిని చెల్లించాలని కోరింది. అంతేకాదు, ఐరాసకు అమెరికా భారీగా బకాయిపడిందని ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో, వైరస్ విషయంలో తమను టార్గెట్ చేసుకుని, ఆరోపణలు గుప్పిస్తోన్న అమెరికాకు చైనా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.అనేక సంవత్సరాలుగా ఉన్న బకాయిలు సహా మే 14 నాటికి ఐరాస సాధారణ బడ్జెట్‌, శాంతిస్థాపన కార్యక్రమ బడ్జెట్‌కు అందాల్సిన మొత్తం వరుసగా 1.63 బిలియన్‌ డాలర్లు, 2.14 బిలియన్‌ డాలర్లు. ఇప్పటి వరకు అత్యధికంగా బకాయిపడ్డ దేశం అమెరికా. సాధారణ బడ్జెట్‌కు 1.165 బిలియన్‌ డాలర్లు, శాంతిస్థాపన బడ్జెట్‌కు 1.332 బిలియన్‌ డాలర్లు యూఎస్‌ అందించాల్సి ఉంది’ అని చైనా తన ప్రకటనలో పేర్కొంది.ఐరాస బడ్జెట్‌లో అత్యధికంగా 22 శాతం నిధుల్ని అమెరికాయే సమకూరుస్తోంది. ఏటా దాదాపు 3 బిలియన్‌ డాలర్ల మేర అందిజేస్తోంది. అలాగే శాంతిస్థాపన కార్యక్రమాలకు అవసరమైన నిధుల్లోనూ 25 శాతం అగ్రరాజ్యమే సర్దుబాటు చేస్తోంది. ఈ లెక్కన ఏడాదికి 6 బిలియన్ డాలర్లు అమెరికా నుంచి ఐరాసకు నిధులు అందుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఐక్యరాజ్యసమితికి అమెరికా 27.89 శాతం నిధుల్ని సమకూర్చాల్సి ఉండగా.. ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని 25 శాతానికి కుదిస్తూ చట్టం తీసుకొచ్చారు.కాగా, ఐరాస బకాయిల విషయంలో చైనా చేస్తున్న ఆరోపణల్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో దోషిగా ఉన్న డ్రాగన్.. అబద్ధాలతో ప్రపంచ దేశాల దృష్టిని మరల్చే ప్రయత్నాల్లో ఇదొకటని దుయ్యబట్టింది. ఇటీవలే శాంతిస్థాపన కార్యక్రమాలకు అమెరికా 726 మిలియన్ డాలర్లు చెల్లించిందని ఐరాసలో యూఎస్‌ శాశ్వత కమిషన్‌ వెల్లడించింది. శాంతిస్థాపన బడ్జెట్‌కు కేవలం 888 మిలియన్‌ డాలర్లు మాత్రమే బకాయిపడ్డామని తెలిపింది. అందులోనూ 66 శాతం నిధులు 2017 నుంచి 25 శాతం లెక్కన ఇవ్వడం వల్ల ఏర్పడ్డవేనని పేర్కొంది.శాంతి పరిరక్షణ కార్యకలాపాల కోసం సభ్య దేశాల అందజేసే నిధులతోనే ప్రపంచవ్యాప్తంగా 15 లేదా అంతకంటే ఎక్కువ మిషన్లకు దళాలను సమకూర్చే దేశాలకు ఐరాస రీయింబర్స్‌మెంట్లు చెల్లిస్తుంది. ఈ నిధులు బకాయి పడితే దీనిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. శాంతి పరిరక్షణ మిషన్‌లకు నగదు గణనీయంగా మెరుగుపడితే తప్ప, సంవత్సరం మధ్యలో జాప్యం తప్పదని మే 11న ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హెచ్చరించారు.మొత్తం 193 సభ్య దేశాల్లో చైనా సహా 50 దేశాలు తమ నిధులను పూర్తిగా చెల్లించాయి. అమెరికా తర్వాత పెద్ద మొత్తంలో చైనాయే ఐరాసకు నిధులు అందజేస్తుంది. ఐరాస వార్షిక బడ్జెట్‌లో 12 శాతం, శాంతి పరిరక్షణ బడ్జెట్‌కు 15 శాతం నిధులు డ్రాగన్ అందజేస్తోంది.

Related Posts