YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

న్యూ మోడల్ లో టెన్త్ ఎగ్జామ్స్

న్యూ మోడల్ లో టెన్త్ ఎగ్జామ్స్

న్యూ మోడల్ లో టెన్త్ ఎగ్జామ్స్
కరోనా నేపథ్యంలో మారిన నిబంధనలకు అనుగుణంగా పదోతరగతి మోడల్‌ ప్రశ్న పత్రాలను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. గతంలో 50 మార్కులకు ఉండే ప్రశ్నపత్రాలను వంద మార్కులకు మార్చడంతో ఈ కొత్త ప్రశ్నపత్రాల నమూనాలను విడుదల చేసింది.11 పేపర్లను 6 పేపర్లుగా కుదించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లు ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలను నిన్న విడుదల చేసింది. ఇందులో సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలకు కలిపి 46, జీవశాస్త్రం నుంచి 54 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.సాంఘిక, గణితంలో పేపర్‌-1 లేదా పేపర్‌-2 నుంచి 8 మార్కులకు ఒక ప్రశ్న ఉంటుంది. మిగతా 92లో పేపర్‌-1, 2ల నుంచి ఒక్కోదాని నుంచి 46 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. తెలుగు నమూనా ప్రశ్నపత్రాన్ని ఈ రోజు విడుదల చేస్తారు.పదోతరగతి పరీక్షలను జులై 10 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాల విషయంలో కీలక మార్పు చేశారు. వాటి సంఖ్యను 11 నుంచి 6కు కుదించారు. ప్రస్తుతం హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 50మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపరు చొప్పున 100మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలకు ఎలాంటి విరామం లేకుండా రోజువారీగా నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి

Related Posts