YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పోతిరెడ్డిపాడుకు బ్రేక్

పోతిరెడ్డిపాడుకు బ్రేక్

పోతిరెడ్డిపాడుకు బ్రేక్
హైద్రాబాద్, మే 16,
పోతిరెడ్డిపాడు జలవివాదంపై కేంద్రం స్పందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయమై బండి సంజయ్ ఇటీవలే కేంద్రం జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాయగా మంత్రి బదులిచ్చారు. ఈ వ్యవహారంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కృష్ణా బోర్డుకు సూచించారు. కృష్ణా నదిపై నిర్మించే ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించాలని.. అప్పటి వరకు ఏపీ ముందుకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అలాగే అపెక్స్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కృష్ణా జలాలను కాపాడటంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా నదిలో వాస్తవానికి తెలంగాణ వాటా 535 టీఎంసీలు ఉండగా.. కేసీఆర్‌ అసమర్థతతో 299 టీఎంసీలకు పరిమితమైందని ఆయన విమర్శించారు. నదీ జలాల విషయంలో కేసీఆర్‌ సరైన వాటా సాధించలేకపోయారన్నారు.వాస్తవాలేంటో తెలియజేయాలని కేఆర్ఎంబీని ఆదేశించిన షేకావత్కృష్ణా నది నుంచి 150 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా తీసుకెళ్తోందన్న సంజయ్.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు. టెలిమెట్రిక్‌లను ఏర్పాటు చేయడంలో కూడా కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు.+
 

Related Posts