YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం సినిమా తెలంగాణ

ధియేటర్లలో వైన్స్

ధియేటర్లలో వైన్స్

ధియేటర్లలో వైన్స్
హైద్రాబాద్, మే 16
షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి. కొత్తగా రావాల్సిన సినిమాలు సైతం రిలీజ్ కాకుండా పోయాయి. దీంతో సినీ పరిశ్రమకు భారీగా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే లాక్‌డౌన్‌ అనంతరం థియేటర్లను పునఃప్రారంభిస్తే ప్రేక్షకులు వస్తారా? రారా? అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. కరోనా ఇంకా మనుషుల్ని పట్టి పీడిస్తున్న వేళ సినిమాలు చూసేందుకు హాల్స్‌కు జనం వస్తారా అంటే డౌటే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు.తిరిగి ప్రారంభించిన అనంతరం ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడాలంటే ఏం చేయాలి?ఆయన నెటిజన్లను కోరారు. 'ప్రేక్షకులకు వైన్‌, బీర్‌ అందించే విధంగా థియేటర్లు కనుక లైసెన్స్‌ పొందితే సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందా అని ఓసారి సురేశ్‌బాబు, రానా నేను మాట్లాడుకున్నాం. ఇలా చేస్తే థియేటర్‌ వ్యాపారం మెరుగుపడుతుందా? అని చర్చించుకున్నాం. ఈ విషయంపై మీరు ఏం అనుకుంటున్నారు.. ఇది మంచి ఆలోచనా? లేదా చెడు ఆలోచనా?. ఏదీ ఏమైనా ఒకటి మాత్రం నిజం.. ఒకవేళ ఈ ఆలోచననే అమలు చేస్తే సినిమా చూడడానికి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ తగ్గిపోతారు.అంతేకాకుండా వైన్‌, బీర్‌ అందించే ఆలోచన కేవలం కొన్ని మల్టీప్లెక్స్‌లకు మాత్రమే పరిమితం కావొచ్చు. కానీ ఇది పూర్తి పరిష్కారం కాదు. లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరగాలంటే ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలు చెప్పండి. థియేటర్లు ఓపెన్‌ చేయగానే మీరు సినిమా చూడడానికి వస్తారా? లేదా ఇంకొంత కాలం వేచి చూస్తారా?' అని నాగ్‌ అశ్విన్‌ నెటిజన్లను అడిగారు. దీంతో ఇప్పుడు నాగ్ అశ్విన్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ట్వీట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related Posts