YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి

గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి

గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు  ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష
  దీక్షకు మద్దతుగా రాస్థ్త్ర వ్యాప్తంగా 1200 కేంద్రాలలో నిరుద్యోగులు దీక్షలు
హైదరాబాద్ మే 16
రాష్ట్రం లోని  7500 గ్రామీణ ఉపాధి. ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని  డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు  ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షను ప్రారంబించారు. విద్యానగర్ లోని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యాలయంలో కొనసాగిస్తున్న దీక్షకు మద్దతుగా  కాంగ్రెస్ నేతలు వి హన్మంతరావు మాజీ ఎంఏల్సి రాములు నాయక్..సిపిఐ రాస్త్ర కార్య దర్శి చాడా వెంకటరెడ్డి  యల్ రమణ హాజరై తమ సంఘీబావాన్ని ప్రకటించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా కుదీలైన చేతి వృత్తులను ఆడుకోవాలని డిమాండ్ చేశారు.చేతివృత్తులపై జీవించే వారిని ఆడుకోడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తొలిగించిన 7500 గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటాలు చేసి సాదించుకున్న తెలంగాణ రాష్ట్రంఇదేనా అని వారు ప్రశ్నించారు.. కృష్ణయ్య దీక్షకు మద్దతుగా రాస్థ్త్ర వ్యాప్తంగా 1200 కేంద్రాలలో నిరుద్యోగులు దీక్షలు ప్రారంబించారు. ఈకార్యక్రమం లో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలావెంకటేష్  ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ  బీసీ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ కోలా జనార్ధన్,బీసీ మహిళా సంఘం రాష్ట్ర అద్యక్ధురాలు ఆలం పల్లి లత బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి అనంతయ్య  జిల్లాపల్లి అంజి మొదలగు వారు పాల్గొని సంఘీబావాన్ని ప్రకటించారు.

Related Posts