YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

అద్భుతమైన ఫలితాల నిస్తున్న ప్రత్యక్ష పెట్టుబడుల సంస్కరణలు

అద్భుతమైన ఫలితాల నిస్తున్న ప్రత్యక్ష పెట్టుబడుల సంస్కరణలు

అద్భుతమైన ఫలితాల నిస్తున్న ప్రత్యక్ష పెట్టుబడుల సంస్కరణలు

 నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యత      పోటీకి అనుగుణంగా భారత్‌ సన్నద్ధం కావాలి

  ఒకే దేశం-ఒకే మార్కెట్‌ విధానం         ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ మే 16
 కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్‌డౌన్‌తో కుదేలయిన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్‌ లక్ష్యంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం మరిన్ని వివరాలను వెల్లడించారు. తీవ్ర పోటీని ఎదుర్కొనే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాల్సి ఉందని ఆమె అన్నారు. వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన సంస్కరణలు చేపట్టారన్నారు. ప్రత్యక్ష పెట్టుబడుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.  తమ ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీకి మోక్షం లభించిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు ప్రధానంగా నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామని, పెట్టుబడులను వేగవంతం చేసేందుకు విధానపరమైన సంస్కరణలు చేపట్టామన్నారు. పారిశ్రామిక రంగంలో మౌళిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ బ్యాంకుల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక క్లస్టర్ల గుర్తించామన్నారు. 5 లక్షల హెక్టార్లలో 3376 ఇండస్ట్రియల్ పార్కుల గుర్తింపు, బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రక్రియ నిరంతరం జరుగుతోందని సీతారామన్‌ తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, బీఏఎఫ్‌ఆర్‌ అమలులో కేంద్ర ప్రభుత్వం చాలా ముందుందని చెప్పారు. రానున్న రోజుల్లో పోటీకి అనుగుణంగా భారత్‌ సన్నద్ధం కావాలన్నారు.  'వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన సంస్కరణలు చేపట్టారు.  చాలా రంగాలు సరళీకరణ విధానాలు కోరుకుంటున్నాయి. ఒకే దేశం-ఒకే మార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తాం. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యక్ష పెట్టుబడుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజలకు నేరుగా నగదు అందించే విషయంలో ప్రభుత్వం ముందుందని' మంత్రి నిర్మల పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుతలవారీగా ప్రకటిస్తున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు చిన్న పరిశ్రమలు, రెండో రోజు వలస కూలీలు, రైతులు, మూడవ రోజు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సహక ప్యాకేజీ ప్రకటించారు. నేడు నాల్గవ విడత ఆర్థిక ప్యాకేజీని మంత్రి మీడియా సమావేశం ద్వారా ప్రకటించారు

Related Posts