హైదరాబాద్: బర్త్ డే పార్టీ తో 28 మందికి కరోనా
హైదరాబాద్ 17. కరోనా వైరస్ నివారణలో భౌతిక దూరం పాటించకపోవడంతో జరిగే అనర్థాలపై ప్రభుత్వాలు, పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయినా కూడా ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి తాజా నిదర్శనమే హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ మాదన్నపేటలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో 28 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఓ పుట్టిన రోజు వేడుక జరుపుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ వేడుకకు హాజరైనవారిలో మొత్తం 28 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తేల్చారు.