YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నిన్న ఒక్కరోజే 4,885 కేసులతో దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిద్

నిన్న ఒక్కరోజే 4,885 కేసులతో  దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిద్

నిన్న ఒక్కరోజే 4,885 కేసులతో  దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిద్
ఢిల్లీ  17. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత విజృంభిస్తోంది. శనివారం దేశవ్యాప్తంగా 4,885 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలో కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం మరో 1,606 కేసులు మహారాష్ట్రలో నమోదు కాగా.. గుజరాత్‌లో ఈ సంఖ్య 1,057గా నమోదయ్యింది. కరోనా మరణాల్లోనూ మహారాష్ట్ర, గుజరాత్‌‌లు ముందు వరుసలో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 67 మంది, గుజరాత్‌లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 118 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,871కి చేరింది.వివిధ రాష్ట్రాల వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల సంఖ్య 90,674కి చేరింది. రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసులు 80వేలు నుంచి 90వేలకు చేరాయి. శుక్రవారంతో పోల్చితే శనివారం అదనంగా 1,100 పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం. శనివారం తమిళనాలో 1,057 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 10,989కి చేరింది. తమిళనాడులో 477 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 10,585గా నమోదయ్యింది. మహారాష్ట్ర (30,706) తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లోనే పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నిర్ధారణ అవుతున్నాయి. గుజరాత్‌లో అహ్మదాబాద్ నగరంలోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కోవిడ్ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మే 13న అత్యధికంగా 54 మంది ప్రాణాలు కోల్పోగా.. శనివారం దానిని అధిగమించింది. అక్కడ మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,135కి చేరింది. ముంబయి నగరంలోనే అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం నాటి 67 మరణాల్లో 41 ఆ నగరంలోనే ఉన్నాయి. ఒక్క ముంబయిలోనే 18,555 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరగడం సానుకూలంశం. గడచిన 24 గంటల్లో 2,045 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 34,223కి చేరింది. అంటే రికవరీ రేటు 35 శాతంగా ఉంది. ఇక, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో‌నూ వైరస్ తీవ్రంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 254 కేసులు నమోదు కాగా.. ఇండోర్ నగరంలోనే 92 ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంక్య 4,928కి చేరింది. యూపీలోనూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వలస కార్మికుల రాకతో పాజిటివ్ కేసులు అక్కడ పెరుగుతున్నాయి. నిన్న 203 కేసులు నమోదు కాగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలోనూ బాధితుల సంఖ్య 4,264 ఉంది.వరుసగా నాలుగు రోజుల నుంచి రాజస్థాన్‌లో సగటున 200 కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1500 దాటింది. శనివారం కొత్తగా 55 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 కేసులు నమోదయ్యాయి. అటు, ఆంధ్రప్రదేశ్‌లో శనివారం రాష్ట్రంలో 48 మందికి కొత్తగా వ్యాధి సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 31 మంది కోయంబేడు వెళ్లి వచ్చినవారే ఉన్నారు

Related Posts