YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

నేడు భారీ తుఫానుగా అంపన్.. రాబోయే రెండు రోజులు ఏపీలో వర్షాలు

నేడు భారీ తుఫానుగా అంపన్.. రాబోయే రెండు రోజులు ఏపీలో వర్షాలు

నేడు భారీ తుఫానుగా అంపన్.. రాబోయే రెండు రోజులు ఏపీలో వర్షాలు
విశాఖపట్నం 17. శనివారం సాయంత్రం తుఫానుగా మారినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాను మారనుందని హెచ్చరించింది. ఈ పెను తుఫానుకి అంపన్‌గా నామకరణం చేశారు. ఇది మరింత బలపడి మంగళవారానికి ప్రచండ తుఫానుగా మారనుందని పేర్కొంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం తర్వాత వాయుగుండంగా తదుపరి ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణంగా 1000 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని దిఘాకు నైరుతిగా 1,160 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేరపుపురాకు వాయువ్యంగా 1,220 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.

Related Posts