YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

కృతజ్ఞత మీరు తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు!

కృతజ్ఞత మీరు తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు!
కృతజ్ఞత మీరు తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు!

కృతజ్ఞతాభావం అంటే ఏంటి? మీరు మీ కళ్ళను  బాగా తెరిచి  మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితంలో మిగతావాటి ప్రమేయాన్ని మీరు స్పష్టంగా చూస్తే, కృతజ్ఞతాభావం కలగకుండా మానదు. మీ ఎదురుగా పళ్ళెం నిండా ఆహారం ఉందనుకుందాం. ఆ ఆహారం మీ పళ్ళెంలో ఉండడానికి ఎంతమంది పని చేసుంటారో మీకు తెలుసా ? విత్తనాలు నాటిన రైతు దగ్గరి నుండీ, ఆ భూమి మీద జరిగే ఎన్నో ఘటనలు దాకా, అలాగే కోత కోసేవాడు, దాన్ని అమ్మేవాడు, షాప్ కు తెచ్చేవాడు, దాన్ని అక్కడి నుంచీ కొనేవాడు, ఇలా దీనిలో ఎంతమంది ప్రమేయం ఉందో చూడండి. మీరు మీ కళ్ళను  బాగా తెరిచి  మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితంలో మిగతావాటి ప్రమేయాన్ని మీరు స్పష్టంగా చూస్తే, కృతజ్ఞతాభావం కలగకుండా మానదు ‘ నేను దీనికి డబ్బు చెల్లించాను కదా! కాబట్టి, నాకది వచ్చి తీరాల్సిందే’ అని కాకుండా, మీ శ్వాస మొదలుకొని ఆహారం వరకూ, మీ జీవితంలో మీరు ఆస్వాదించే, అనుభూతి చెందే ప్రతీ విషయాన్నీ ఈ విధంగా చూడండి. ఈ మొత్తం వరుస క్రమంలో మనుషులు లేకపోయినా 'లేదా' ఉన్నవాళ్ళు చేయాల్సింది చేయకపోయినా, మీరు ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా, మీకు ఈ వస్తువులు దొరకవు. మీరు కళ్ళు తెరిచి, ఈ గ్రహం, ఈ గ్రహానికి అవతల ఉన్న ప్రతీ ప్రాణి మిమ్మల్ని ఎలా పోషిస్తోందో, మీకు ఎలా సాయపడుతోందో చూడండి. ఇదంతా మీరు చూడగలిగితే, అప్పుడు కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. కృతజ్ఞత తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు. మీకు ఇవ్వబడుతున్న వాటన్నిటినీ చూసి మీరు తబ్బిబ్బైనప్పుడు, మీ నుంచి పెల్లుబుకే భావనే కృతజ్ఞత. అది తెచ్చిపెట్టుకునే గుణమైతే, ఘోరంగా ఉంటుంది. కృతజ్ఞతంటే కేవలం “థాంక్యూ, థాంక్యూ” అని చెప్పడం కాదు. ప్రస్తుతం మీరు జీవించి ఉండటానికీ, క్షేమంగా ఉండటానికి సృష్టిలో ఉన్న ప్రతిదీ తోడ్పడుతున్నాయి. మీరు వాటిని కేవలం ఒక్కసారి గమనించినా, ఆ మనుషల మీదా, ఆ వస్తువుల మీదా కృతజ్ఞతా భావం ఉప్పొంగక మానదు. మీకు వారితో ఎటువంటి సంబంధం లేకపోయినా, మీకు వారు తెలియక పోయినా మీ జీవితంలోని ప్రతి క్షణం వారు మీకు అన్నీ అందిచ్చారు. కృతజ్ఞత తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు. మీకు ఇవ్వబడుతున్న వాటన్నిటినీ చూసి మీరు తబ్బిబ్బైనప్పుడు, మీ నుంచి పెల్లుబుకే భావనే కృతజ్ఞత కాబట్టి, మీరు కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న జీవితం ఎలా జరుగుతోందో చూస్తే, మీరు కృతజ్ఞతా భావంతో ఉండకుండా ఎలా ఉంటారు? మీరు మరీ గర్వంతో జీవిస్తూ, ఈ భూమికే రాజునని అనుకుంటే, మీరు ప్రతీదీ కోల్పోతారు. మీరు పూర్తిగా మీ ఆలోచనలలోనే మునిగిపోయి ఉంటే, మీరు మొత్తం జీవన ప్రక్రియనే కోల్పోతారు. అలా కాకుండా, మీరు ఊరికే అలా చూడగలిగితే, కృతజ్ఞతతో ఉప్పొంగిపోతారు. మీరు కృతజ్ఞతతో ఉంటే, మీరు స్వీకరించడానికీ సిద్ధంగా ఉంటారు. మీకు ఎవరిపట్లైనా కృతజ్ఞతా భావం ఉంటే, మీరు వాళ్ళని గౌరవంగా చూస్తారు. మీరు దేన్నైనా గౌరవంగా చూస్తే, మీరు చాలా స్వీకారభావంతో ఉంటారు. కృతజ్ఞతతో ఉప్పొంగిపోవడం స్వీకార భావంతో ఉండడానికి ఒక మనోహర మార్గం. అది మిమ్మల్ని కొంతవరకు సుముఖంగా ఉంచుతుంది. ఇతరులతో బలప్రదర్శనకు తలపడడం నిజానికి బలహీనతకు నిదర్శనం. కండలు ప్రదర్శించడం, పెడబొబ్బలు పెట్టడం, ప్రగల్భాలు పలకడం... ఇవన్నీ బలహీనులు పైపైన ప్రదర్శించే లక్షణాలు. కానీ బలవంతులు ఎప్పుడూ నిండుకుండలా తొణకరు, బెణకరు సరికదా, అవసరమైతే ప్రత్యర్థిని క్షమించడానికి కూడా వెనకాడరు. ‘క్షమించడం’ బలహీనుడికి అనివార్యం కానీ బలవంతుడికి అది ఔదార్యం. బలహీనుడి క్షమాపణ అర్థం లేనిది. బలవంతుడి క్షమాపణ మరువలేనిది. కృతజ్ఞత అనేది రుచికరమైన ఆహారం లాంటిది. దాన్ని ఇతరులతో పంచుకుంటే మరింత ఆనందిస్తాం. మనం చేసినదానికి ఇతరులు కృతజ్ఞత కలిగివున్నారని తెలుసుకున్నప్పుడు మనం సంతోషిస్తాం. అలాగే మనం ఇతరులకు కృతజ్ఞతలు చెప్పినప్పుడు వాళ్లు సంతోషిస్తారు. మనకు సహాయం చేయడానికి లేదా మన అవసరాన్ని తీర్చడానికి వాళ్లు చేసిన కృషి వల్ల మనకు నిజంగా మేలు జరిగిందని వాళ్లు గ్రహించగలుగుతారు. దానివల్ల మనకూ వాళ్లకూ మధ్యున్న స్నేహం ఇంకా బలపడుతుంది. బంగారంతో తయారుచేసిన ఆపిల్‌ని ఒక వెండి పళ్లెంలో పెట్టినప్పుడు అది చూడడానికి ఎలా ఉంటుందో ఊహించండి. అలాగే దానికి ఎంత విలువ ఉంటుందో ఆలోచించండి. మీకు ఎవరైనా అలాంటి గిఫ్ట్‌ ఇస్తే మీకెలా అనిపిస్తుంది? ఇతరులపట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ మీరు చెప్పే మాటలు కూడా అంతే విలువైనవి. అంతేకాదు ఒక బంగారు ఆపిల్‌ చాలా కాలంపాటు ఉంటుంది. అదేవిధంగా, మీరు కృతజ్ఞతను మాటల్లో వ్యక్తం చేసినప్పుడు అవి విన్న వ్యక్తి వాటిని జీవితాంతం గుర్తుంచుకుంటాడు, హృదయంలో భద్రపర్చుకుంటాడు
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts