YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

ఆస్పత్రుల్లో చార్జీలు పెంచారు..

ఆస్పత్రుల్లో చార్జీలు పెంచారు..

ఆస్పత్రుల్లో చార్జీలు పెంచారు..
కరీంనగర్, మే 18,
కరోనా.. ఇతర రోగులనూ వదుల్తలేదు. వైరస్ సోకనివారికీ కష్టం, నష్టం తప్పుతలేవు. కరోనా ఎఫెక్ట్తో అన్నిరకాల ట్రీట్మెంట్ఖర్చులు పెరుగుతున్నాయి. కొద్దిరోజుల నుంచి తెలంగాణలోని  గ్రీన్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో ప్రైవేట్  హాస్పిటళ్లు, నర్సింగ్హోమ్లు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. కానీ వెళ్తున్న రోగులకే చుక్కలు కనిపిస్తున్నాయి. డాక్టర్లంతా కన్సల్టేషన్ ఫీజులను, టెస్టుల బిల్లులను రూ.100 నుంచి రూ.200 వరకు పెంచేశారు. ఇక ఇన్పేషెంట్విభాగంలో బెడ్చార్జీలు మొదలుకొని సర్జరీల వరకు అదనంగా వేలకు వేలు వసూలు చేస్తున్నారు.కరీంనగర్కు  చెందిన ఓ ప్రముఖ న్యూరో ఫిజీషియన్ గతంలో కన్సల్టేషన్ ఫీజుగా రూ.300 తీసుకునేవారు. లాక్డౌన్ తర్వాత  ఈ మొత్తాన్ని రూ. 400కు పెంచారు. కరోనా కారణంగా తన క్లినిక్లో  ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నామని, గతంలో రోజుకు కనీసం 100 ఓపీ చూసే తాను ఇప్పుడు 40 మించి చూడడం లేదని పేర్కొంటున్నారు. తాను ప్రతిరోజూ పీపీఈ సూట్ ధరిస్తున్నానని, రోగులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామని, అందువల్లే కన్సల్టేషన్ ఫీజు పెంచక తప్పలేదని ఆయన చెబుతున్నారు. వివిధ జిల్లాల్లోని పలు హాస్పిటళ్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కన్సల్టేషన్ ఫీజులను కనీసం రూ.100 నుంచి రూ.200 వరకు పెంచారు. కొన్ని జిల్లాల్లో పిడియాట్రిషియన్స్ ఒక్కొక్కరి నుంచి రూ.600 వరకు తీసుకుంటున్నారు. జనరల్ ఫిజీషియన్స్, సర్జన్స్ మాత్రం పెద్దగా పెంచలేదు. కరోనా నేపథ్యంలో డాక్టర్లు తమ, పేషెంట్ల సేఫ్టీ కోసం ముందుజాగ్రత్తగా పీపీఈ సూట్లను, గ్లోవ్స్ను వాడుతున్నారు. సిబ్బందికి మాస్కులను, రోగులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. చాలాచోట్ల హ్యాండ్ వాష్కు ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్పిటల్గదుల్లో, హాళ్లలో డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రే చేయిస్తున్నారు. వీటన్నింటికి అయ్యే ఖర్చును చివరకు పేషెంట్లపై మోపుతున్నారు. పలు హాస్పిటల్స్, డయాగ్నసిస్ సెంటర్లలో చిన్నచిన్న టెస్టులకయ్యే చార్జీలను రూ.100 వరకు, ఎక్స్రే, వివిధ స్కానింగ్ రేట్లను రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పెంచేశారు.పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ మెటర్నిటీ హాస్పిటల్లో  సిజేరియన్కు గతంలో రూ.20 వేల నుంచి రూ. 25 వేల వరకు తీసుకునేవారు. అందులో ఆపరేషన్, బెడ్చార్జీలు, ఇతరత్రా కలిసి ఉండేవి.  తాజాగా అదే సిజేరియన్కు  రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నారు. సర్జరీలో పాల్గొనే డాక్టర్లు, సిబ్బంది కనీసం నలుగురు ఉంటారని, వారి పీపీఈ కిట్ల ఖర్చును పేషెంట్ బిల్లులో వేయడం వల్లే ఆ మేరకు పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని  ఓ హాస్పిటల్లో ఇన్పేషెంట్కు మెడిసిన్ తో పాటే మూడు పీపీఈ కిట్లు, మూడు క్యాజువల్ డిస్పోజబుల్ కిట్లు రాస్తున్నారు. సర్జన్ కు ఒకటి, అనస్థీషియనిస్టులకు ఒకటి, థియేటర్ అసిస్టెంట్ కు ఒకటి చొప్పున పీపీఈ కిట్లు వాడుతున్నారు. వీటి విలువ క్వాలిటీని బట్టి ఒక్కోదానికి  రూ. 1000 నుంచి రూ.1500 వరకు ఉంటోంది.  ఇలా ఒక్కో ఇన్పేషెంట్పై అదనంగా సుమారు రూ. 5 వేల వరకు బర్డెన్ పడుతోంది.ప్రైవేట్ హాస్పిటల్స్ తెరుచుకునేందుకు అనుమతిచ్చిన సర్కారు.. డాక్టర్లు, నిర్వాహకులకు కొన్ని రూల్స్ పెట్టింది.  ప్రతి పేషెంట్ ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని, వారికి థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని, డాక్టర్ చాంబర్ లోకి ఒక్కొక్కరిని  మాత్రమే పంపించాలని ఆదేశించింది.  కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే డీఎంహెచ్వోకు గానీ, 108కుగానీ ఫోన్చేసి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించాలని సూచించింది. కానీ రోజూవారీ చూసే ఓపీ సంఖ్యకు సంబంధించి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ విధించలేదు.  దీంతో డాక్టర్లే వారి క్లినిక్లు, హాస్పిటళ్ల కెపాసిటీని బట్టి రోజుకు 20 నుంచి 40 మంది పేషెంట్లను చూస్తున్నారు. కొందరు మాత్రం ఇవేవీ పాటించకుండా ఇప్పటికీ పెద్దసంఖ్యలోనే ఓపీ చూస్తున్నారనే  ఆరోపణలున్నాయి.మా దగ్గరికి వచ్చే పేషెంట్లలో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియదు. అందువల్ల హాస్పిటల్  లో పనిచేస్తున్న సెక్యూరిటీ మొదలుకుని, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ సిబ్బంది, డాక్టర్లు ఇలా అందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం.  చేతులకు గ్లోవ్స్, మాస్కులు, ఫేస్ షీల్డ్ మాస్కులు అందిస్తున్నాం. హాస్పిటల్ కు వచ్చేవారికి ముందుగానే స్క్రీనింగ్ చేస్తున్నాం. హ్యాండ్ వాష్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఆసుపత్రిలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అన్ని గదులు, హాళ్లలో, డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రే చేయిస్తున్నం. ఇక  డాక్టర్లంతా తప్పనిసరిగా పీపీఈ కిట్ ధరించాల్సి వస్తోంది. ఇలా ఖర్చు పెరిగినందునే కొంత భారాన్ని పేషెంట్లపై మోపక తప్పడం లేదంటున్నారు నిర్వాహకులు

Related Posts