YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అజ్ఞాతంలో ఉప ముఖ్యమంత్రి పాముల, మంత్రి ధర్మాన

అజ్ఞాతంలో ఉప ముఖ్యమంత్రి పాముల, మంత్రి ధర్మాన

అజ్ఞాతంలో ఉప ముఖ్యమంత్రి పాముల, మంత్రి ధర్మాన
 రాజమండ్రి. మే 18
ఏపి ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖా మంత్రి  పాముల పుష్ప శ్రీ వాణి. ఏపి ఆర్ & బి మంత్రి ధర్మాన కృష్ణ దాస్. వీరు ఇరువురు గత కొంత కాలంగా ఆ జిల్లాలలో గాని, రాష్ట్ర పాలనలో గాని పెద్దగా కనబడటం లేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అద్యక్షుడు మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్తం చేశారు. ఈ రోజు  వరకు వీరు గ్యాస్ లీక్ బాధితులను కూడా పరామర్శించిన దాఖలాలు లేవు, మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతి లు తో పాటు విజయసాయి రెడ్డి మాత్రమే కనబడుతున్నారని ఆయన తెలిపారు.  ముఖ్యమంత్రి సైతం వీరికే ఆ భాద్యతలు అప్పగించటం అనేక అనుమానాలు కు తావు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనా సేవలలో కూడా కనబడటంలో గైరుహాజరు  అయితున్నారని,  వైద్య శాఖా మంత్రి నిర్వహించిన మీటింగ్ లో మాత్రం ఒకేసారి తళుక్ మని మెరిసి మాయమై పోయారని ఆయన గుర్తు చేసారు. జగన్ సర్కార్ పై ప్రజలలో ప్రభ తగ్గుతుందనే కారణంతో ముందు జాగ్రత్తగా జగన్ పార్టికి దూరంగా ఉంటున్నారా ! వైసిపి పార్టికి దూరమయ్యే ఆలోచనలో ఉన్నారా !! అనేది మంత్రులు వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ ఏదో ఒక సందర్బంలోనైనా  కనబడేవారని  విశాఖపట్నం లో అంత బారి ప్రమాదం జరిగితే ఆ ప్రాంత ప్రతినిధిగా బాధితులను పరామర్శించటానికి రాకపోవటం పై విశాఖ ప్రజలు గుర్రు మంటున్నారని ఆయన  విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పాముల, మంత్రి ధర్మాన జగన్ వెంటే వున్నాము. వైసిపి పార్టీలోనే వున్నాము అని అజ్ఞాతం విడిచి ఒక ప్రకటన చేయక పొతే సొంత పార్టి వారికి, ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వాపోయారు. ఈ మంత్రులు గైరుహాజరుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రజలు గుసగుసలు నిజమనిపిసున్నాయని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ప్రజలు ముందుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నా మంత్రుల మౌనం వెనుక ఆంతర్యం తెలియుటలేదని ఆయన అనుమానం వ్యక్త పరిచారు.

Related Posts