YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జగన్ వైపే..మోడీ చూపు

జగన్ వైపే..మోడీ చూపు

జగన్ వైపే..మోడీ చూపు
న్యూఢిల్లీ, మే 18,
ద్రబాబు రాజకీయం ఔట్ డేటెడ్ అంటారు. ఇపుడు అది అక్షరాలా నిజం అనిపిస్తోంది. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు శాశ్వతం కాదు అన్నది నిజమే కానీ మరీ దారుణంగా బట్టలు మార్చినట్లుగా మిత్రులను, శత్రువులను మార్చేస్తే అది చివరికి విశ్వసనీయతకే చేటు తెస్తుందని చంద్రబాబుని చూసే చెప్పాలేమో. చంద్రబాబు తన రాజకీయ జీవితం మొత్తంలో పూర్తిగా కలసి ఫలనా వారితో కొంత దూరమైనా ప్రయాణించారన్నది లేదు. ఆయనది అవకాశవాద రాజకీయం, అధికారం వైపుగా సాగే రాజకీయం అంటారు. చంద్రబాబు ఇలా ఎన్నో తలలను మార్చుకుంటూ ఏమార్చుకుంటూ మూడు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు, కానీ ఇక ముందు మాత్రం ఆయన ఆ విధంగా మిత్రులను సంపాదించలేరని అంటున్నారు.కేంద్రంలో మోడీ, అమిత్ షా బలంగా ఉన్నారు. బీజపీని వారే చెరో వైపున నిలిచి మోస్తున్నారు. వాజ్ పేయ్, అద్వాని కాలంలో అయితే సంప్రదాయ రాజకీయం నడిచేది, కానీ ఇపుడు అలా కాదు, మాకేంటి లాభం అన్న తీరునే కొలమానం వేసుకుని మరీ మోడీ, షా రాజకీయాలు చేస్తారని అంటారు. ఇక 2014 ఎన్నికల్లో చంద్రబాబు తో మోడీ కలసి వెళ్లడానికి మధ్యవర్తిత్వం చేసింది అప్పటి సీనియర్ నేత వెంకయ్యనాయుడు అని ప్రచారంలో ఉంది. ఆ తరువాత మోడీ ప్రధానిగా బాగా శక్తిమంతుడయ్యారు. ఇక రెండవ సారి కూడా అధికారం సాధించిన తరువాత ఆయన చూపు దీర్ఘకాలికంగా పగ్గాలు చేపట్టాలన్న దాని మీదనే ఉంది. ఈ క్రమంలోనే మిత్రులు, శత్రువులను ఎంచి చూసుకుంటున్నారు. ఏపీ విషయానికి వస్తే చంద్రబాబుని పూర్తిగా పక్కన పెట్టారని అంటున్నారు.చంద్రబాబు ఇపుడు స్వయం ప్రకాశం కోల్పోయి ఉన్నాడు. ఆయన్ని తట్టి లేపి తమ బలం ఇచ్చి ఏపీలో కుర్చీ అప్పగించాల్సిన అవసరం బీజేపీ పెద్దలకు ఉందా అన్నదే ఇక్కడ చర్చ. పైగా చంద్రబాబు ఒకసారి బలోపేతమయ్యాక ఆయన చూపు కచ్చితంగా జాతీయ రాజకీయల వైపు ఉంటుంది. ఆయన మళ్ళీ ఢిల్లీ వస్తారు, కొత్త కూటములు అంటారు. 2019 ఎన్నికల ముందు మోడీ, షాలు చంద్రబాబుతో పడిందే ఇది. ఒకవేళ పూల్వామా దాడులు జరగకపోయి ఉండినా, దేశంలో ప్రతిపక్షాలు మరింత ఐక్యత చూపినా కూడా 2019 ఎన్నికల్లోనే మోడీ మాజీ ప్రధాని అయ్యేవారు. కళ్లకు కట్టినట్లుగా కనిపించిన ఆ దృశ్యాన్ని ఆయన కానీ, షా కానీ సులువుగా ఎప్పటికీ మరచిపోలేరు కూడా. ఇక నాడు మోడీని కుర్చీ దించడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు చంద్రబాబు అన్ని విధాలుగా దెబ్బతిని ఉన్నారు. పోనీ అని చేరదీస్తే అసలుకే ఎసరు తెస్తాన్నదే బీజేపీ పెద్దల డౌట్. చంద్రబాబు విశ్వసనీయత మీద కూడా కేంద్ర పెద్దలకు నమ్మకం లేకపోవడంతోనే పక్కన పెడుతున్నారని అంటున్నారు.ఏపీలో ఇపుడున్న రాజకీయ పరిస్థితులు పరిణామలు తీసుకుంటే యువ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. ఆయన ఓ విధంగా మిత్రునిగానే బీజేపీకి ఉన్నారు. ఏపీలో తీసుకుంటే బీజేపీ ఇప్పట్లో బలపడదు, పైగా వైసీపీ ఎంపీలను భారీగా గెలుచుకున్నా కీలక సమయంలో ఆ మద్దతూ ఎటూ బీజేపీకే ఉంటుంది. జగన్ కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి చాలాకాలం ఆయన రాజకీయం ఏపీకే పరిమితం అవుతుంది. ఆయన ఢిల్లీ వైపు అసలు చూడరు. మోడీ,షాలకు అదే కావాల్సింది. అందుకే జగన్ వైపే మోడీ తూకం మొగ్గు చూపుతోందని అంటున్నారు. ఇక జగన్ కి జనాదరణ ఉంది. ఆయన్ని వదిలేసినా కేసీయార్ తో జట్టు కడతారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అది కూడా బీజేపీకి మరో తలనొప్పి. అందువల్లనే జగన్ వైపుకే మోడీ టీం చూస్తోందని, ఈ కారణంగానే చంద్రబాబు విన్నపాలు నేలపాలు అవుతున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద ఈ సమీకరణలు కనుక చూసుకుంటే బీజేపీతో చంద్రబాబు జట్టు కట్టడం అన్నది ఎప్పటికీ కలగానే చూడాలేమో.

Related Posts