YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సొంతూళ్లకు నర్సులు

సొంతూళ్లకు నర్సులు

సొంతూళ్లకు నర్సులు
కోల్ కత్తా, మే 18
కోవిద్‌-19 కేసులతో కోల్‌కతా, హౌరాలు పోరాడుతున్నవేళ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది నర్సులు తమ ఉద్యోగాలకు స్వస్తిపలికారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే వందలాదిమంది నర్సులు సామూహికంగా రాజీనామాలు చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ప్రైవేటు ఆసుపత్రులు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నర్సులు ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 300 మంది నర్సులు తమ ఉద్యోగాలను వదులుకుని తమ సొంతూళ్ళకు వెళ్ళిపోవడంతో కోవిడ్ 19 రోగులకు సేవలు అందించడం కష్టంగా మారింది.ఈ సమస్యను పరిష్కరించాలని అసోసియేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా (ఏహెచ్ఈఐ) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హాకు లేఖ రాసింది. సొంతూళ్ళకు వెళ్లిన నర్సుల్లో మణిపూర్‌వాసులు ఎక్కువ మంది ఉన్నారు. త్రిపుర, ఒడిశా, జార్ఖండ్‌లకు చెందినవారు కూడా తమ స్వరాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఏహెచ్ఈఐ ప్రెసిడెంట్ ప్రదీప్ లాల్ మెహతా మాట్లాడుతూ నర్సులు తమ సొంతూళ్ళకు వెళ్ళిపోవడానికి కచ్చితమైన కారణాలేమిటో తెలియదన్నారు. అయితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నర్సులను అడిగినపుడు తెలిసిన సమాచారం ప్రకారం, మణిపూర్ ప్రభుత్వం ఆకర్షణీయమైన వేతనం చెల్లిస్తామని ప్రకటించడంతో, నర్సులు తమ స్వంతూళ్ళు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నర్సుల రాజీనామా వ్యవహారంపై మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్  ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. తమ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోని నర్సులు తిరిగి రావాలనే ప్రకటన చేయలేదన్నారు.కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో రోగులకు సేవ చేస్తున్న తమ రాష్ట్ర నర్సులు తమకు గర్వకారణమని అయితే  ఈసంక్షోభం వేళ నర్సులు తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగింది కాదన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2576 చేరాయి. 232 మంది మరణించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మరణాల రేటు పెరగడం ఆందోళనకరంగా మారింది.

Related Posts