YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి దేశీయం

పేదరికంలోకి జారుకున్న 12 కోట్ల మంది

పేదరికంలోకి జారుకున్న 12 కోట్ల మంది

పేదరికంలోకి జారుకున్న 12 కోట్ల మంది
న్యూఢిల్లీ, మే 18,
కరోనా ప్రభావంతో ఆర్ధిక వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం కారణంగా... భారత్‌లో 135 మిలియన్ల (13.5 కోట్లు) మంది ఉద్యోగాలను కోల్పోనున్నారని ఓ అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ అంచనా వేసింది. దీంతో 12 కోట్ల మంది మళ్లీ పేదరికంలోని జారుకుంటారని ఆ సంస్థ పేర్కొంది. భారత్‌లో కోవిడ్-19 ప్రభావంపై అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఆర్థర్‌ డి.లిటిల్‌ అంచనా వేసి ఓ నివేదికను రూపొందించింది. ‘భారత్‌- కోవిడ్‌-19తో ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడం: కొవిడ్‌-19 అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ, బలోపేతం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమం’పేరుతో ఈ నివేదిక రూపొందించిన ఆర్డర్ డి. లిటిట్.. అనేక అంశాలను ప్రస్తావించింది.మొత్తం 13.5 కోట్ల మంది ఉపాధి కోల్పోవడంతో వినియోగదారుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది.. దీని వల్ల వ్యయాలు, పొదుపు తగ్గిపోతాయని నివేదిక పేర్కొంది. అంతేకాదు, తలసరి ఆదాయం క్షీణించడంతోపాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కూడా పడిపోతుందని వ్యాఖ్యానించింది. ‘క్రమంగా భారత్‌లో పెరుగుతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు చూస్తోంటే, రికవరీ ‘డబ్ల్యూ’ ఆకారంలో వచ్చే అవకాశం ఉంది. దీంతో దేశ జీడీపీ 2020-21లో 10.8 శాతం మేర కుంచించుకు పోయి 2021-22లో కేవలం 0.8 శాతం వృద్ధి నమోదు కావొచ్చ’ని నివేదిక అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 95,000కు చేరగా, 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు.‘అంచనా వేసిన జీడీపీ మందగమనం తాలూకూ నష్టంతో ఉద్యోగాలు, పేదరిక నిర్మూలన, తలసరి ఆదాయం, నామమాత్రపు జీడీపీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 7.6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 35 శాతానికి చేరొచ్చు. దీంతో 13.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా మొత్తం 17.4 కోట్ల మంది నిరుద్యోగులు తయారవుతారు. ఈ ప్రభావంతో 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారు. అందులో 4 కోట్ల మంది నిరుపేదలుగా మారతార’ని నివేదిక పేర్కొంది.ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మందగమనం వల్ల భారత ఆర్ధిక పునరుద్దరణ డబ్ల్యు-ఆకారంలో పయనిస్తోందని, ఒక ట్రిలియన్ డాలర్ల నష్టం చవిచూడనుందని డీ ఆర్ధర్ లిటిల్ సంస్థ ఇండియా-దక్షిణాసియా విభాగం అధికారి బర్నిక్ చిత్రన్ మైత్రా వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడంపై దృష్టిసారించిన భారత్‌కు.. తక్షణ ఉద్దీపన, నిర్మాణాత్మక సంస్కరణలపై కేంద్రీకృతం, క్రమబద్ధమైన ఆర్థిక విధానం అవసరం.. ప్రధాని దూరదృష్టితో ఆలోచించి ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీ ప్రకటించడం శుభారంభమన్నారు.

Related Posts