YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

20 వేల కోట్లకు కేంద్రం అనుమతి

20 వేల కోట్లకు కేంద్రం అనుమతి

20 వేల కోట్లకు కేంద్రం అనుమతి
హైద్రాబాద్, మే 18,
నా దెబ్బతో ఆదాయాన్ని కోల్పోయిన తెలంగాణ రాష్ట్రం అదనంగా మరో రూ.20 వేల కోట్ల రుణం తెచ్చుకోవడానికి కేంద్ర వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకూ రాష్ట్ర జీడీపీ (జీఎస్‌డీపీ)లో 3 శాతం వరకే రుణం తెచ్చుకోవడానికి అవకాశం ఉండగా.. తాజాగా కేంద్రం దాన్ని 5 శాతానికి పెంచింది. కరోనా ప్రభావం నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి రుణ పరిమితిని 5 శాతానికి పెంచుతున్నట్లు ఆదివారం నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలు అదనంగా రూ.4.28 లక్షల కోట్లు అప్పులు తెచ్చుకునే వీలుంది.ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రుణ పరిమితిని పెంచాలని తెలంగాణ సర్కారు కొంత కాలంగా కేంద్రాన్ని కోరుతోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రుణ పరిమితిని 5 శాతానికి పెంచడంతో.. ఇప్పటి వరకూ రూ.30 వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉన్న తెలంగాణకు అదనంగా మరో రూ.20 వేల కోట్ల మేర రుణం తీసుకునే వెసులుబాటు లభించింది.రుణ పరిమితిని రెండు శాతం పెంచగా.. 0.5 శాతానికి మాత్రమే ఎలాంటి నిబంధనలను విధించలేదు. మిగతా 1.5 శాతానికి నిబంధనలు విధించింది. 1 శాతం రుణాలను నాలుగు సమాన విడతల్లో తీసుకోవాల్సి ఉంటుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డును అమలుపర్చడం, ఈజ్ ఆఫ్ డూయింగ్, విద్యుత్ పంపిణీ, పట్టణ స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు పెంచడం లాంటి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రుణ పరిమితి పెంచడానికి నిబంధనలను విధించడం సరికాదని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
 

Related Posts