ఎమ్మిగనూరు పట్టణంలో షాపులు తెరుచుకొవడానికి అనుమతి
హోటళ్లు సెలూన్లు రెస్టారెంట్లు టీ స్టాల్స్ షాపింగ్ మాల్స్ సినిమా హాళ్లు కు అనుమతి లేదు
ఉదయం 7గంటల నుండి మద్యహనం 11గంటల వరకు
ఎమ్మిగనూరు మే 18,
కేంద్ర ప్రభుత్వం 4వ విడత లాక్ డౌన్ ను మే 18 నుండి మే 31 వ తేదీ వరకు పొగించడం జరిగింది.ఇందులో భాగంగా కొన్ని వ్యాపారాలుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమీషనరు రఘునాథ్ రెడ్డి తహశీల్దార్ వెంకటేశ్వర్లు సీఐ స్రీధర్ లు పట్టణ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ నిభందనల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో ఉదయం 7గంటల నుండి మద్యహనం 11గంటల వరకు కొన్ని రంగాల వ్యాపారుల చేసుకొవాడానికి అనుమతి ఇచ్చారు. ఎక్కువ మంది ఉండే వ్యాపారాలకు అనుమతి ఇవ్వలేదు. బంగారు,బట్టలు బుక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ టైలరింగ్ ఫొటో స్టుడియోలు మెకానిక్ షాపులు కూల్ డ్రింక్స్ షాపులు చికెన్ మటన్ సిమెంట్ ఐరన్ షాపులతో పాటు మరి కొన్ని షాపులు తెరుచుకొవడానికి అనుమతి ఇచ్చారు. సినిమా హాళ్లు హోటళ్లు టీ స్టాళ్లు పెద్ద షాపింగ్ మాల్స్ సెలూన్లు బార్ అండ్ రెస్టారెంట్లు తో పాటు ఎక్కువ మంది ఉండే షాపులుకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వ తదుపరి ఉత్తర్వలు వచ్చేవరకు నిభందనలు అమలులో ఉంటాయని తహశీల్దార్ వెంకటేశ్వర్లు కమీషనరు రఘునాథ్ రెడ్డి సీఐ శ్రీధర్ తెలిపారు.