YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

గ్యాస్ లీక్ గ్రామంలో ప్రత్యేక ఆస్పత్రి విజయవాడ, మే 18

గ్యాస్ లీక్ గ్రామంలో ప్రత్యేక ఆస్పత్రి విజయవాడ, మే 18

గ్యాస్ లీక్ గ్రామంలో ప్రత్యేక ఆస్పత్రి
విజయవాడ, మే 18
విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామంలో ఓ ఆస్పత్రి, క్లీనిక్‌లు కట్టించాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. బాధిత గ్రామాల ప్రజలకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందజేశారు.విశాఖపట్నం గ్యాస్ లీక్ దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా 10 రోజుల్లోనే పరిహారం అందజేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. విశాఖ గ్యాస్ లీక్ బాధిత గ్రామాల ప్రజలకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందజేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సీఎం జగన్ బటన్ నొక్కడంతో దాదాపు 20 వేల మంది బాధిత ప్రజలందరి ఖాతాల్లో డబ్బు జమ అయ్యాయి. అయితే గ్రామ వలంటీర్లు అందరి ఇళ్లకు వెళ్లి డబ్బు అందాయో, లేదో కనుక్కోవాలని, ఎవరికైనా పడకపోతే అధికారులకు తెలియజేసి వారికి లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు.విశాఖ దుర్ఘటన జరిగినట్లు రిపోర్ట్ అందిన వెంటనే కలెక్టర్, డాక్టర్ల నుంచి పోలీసుల వరకు అందరూ వేగంగా స్పందించారని సీఎం జగన్ చెప్పారు. ఈ విధంగా స్పందించిన అందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు విదేశాల్లో జరిగితే ఎలా స్పందిస్తారో, దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా స్పందించినట్లు చెప్పారు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా రూ. కోటి పరిహారం ఇవ్వడం జరగలేదని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి కమిటీ వేశామని.. నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖలో స్టైరీన్ విష వాయువు చుక్క కూడా లేకుండా తరలించినట్లు వెల్లడించారు.ఈ ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి ఒక్క క్లియరెన్స్ కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. 1996లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2015లో వరకు అన్ని క్లియరెన్సులు టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చాయని వెల్లడించారు. అయినా కూడా దీనిపై తాము ఒక్కమాట మాట్లాడలేదని చెప్పారు. ఈ ఘటన జరిగినప్పుడు ఏం చేయాలో అన్ని పద్ధతి ప్రకారమే చేశామని, ఒకరిపై వేలెత్తి చూపించాలన్న తాపత్రయం తమకు లేదని స్పష్టం చేశారు. అందుకే 12 మంది చనిపోతే.. 10 రోజుల వ్యవధిలోనే అందరికీ రూ. కోటి ఇవ్వడమే కాకుండా, ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ రూ. 10 వేలు ఇచ్చినట్లు వెల్లడించారు. వైద్యం చేయించుకున్న వారందరికీ భారీగా డబ్బు ఇచ్చినట్లు గుర్తు చేశారు.దీనిపై చాలా కమిటీలు వేశామని, వాటి రిపోర్టులు వచ్చిన వెంటనే కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామంలో ఓ ఆస్పత్రి, క్లీనిక్‌లు కట్టించాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. అలాగే ఆయా గ్రామాలకు చెందిన వారికి ప్రత్యేకంగా హెల్త్ కార్డులు ఇచ్చి వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Related Posts