YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

ఒప్పో నోయిడాలో కరోనా

ఒప్పో నోయిడాలో కరోనా

ఒప్పో నోయిడాలో కరోనా
న్యూఢిల్లీ, మే 18,
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నోయిడాలో ఉండే ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసేసింది. అక్కడ పనిచేసే ఆరుగురికి కరోనావైరస్ రావడంతో ఒప్పో ఈ నిర్ణయం తీసుకుంది.ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నోయిడాలో ఉండే ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేసింది. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే ఆరుగురికి కరోనావైరస్ వచ్చిందని తేలడంతో ఒప్పో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో పనిచేసే మూడు వేల మందిని కరోనావైరస్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరింది. ఇప్పుడు ఆ కంపెనీలో పని చేసే వారందిరికీ కరోనావైరస్ నెగిటివ్ వచ్చి, ఆఫీస్ ను పూర్తిగా శానిటైజ్ చేశాక ఇందులో పనులను తిరిగి ప్రారంభిస్తామని ఒప్పో తెలిపింది.ప్రభుత్వ అనుమతితో ఈ నెల ప్రారంభంలో పనులు ప్రారంభించామని ఒప్పో అధికార ప్రతినిధి తెలిపారు. అయితే తమకు ఉద్యోగులు, పౌరుల భద్రతే ముఖ్యమని ఒప్పొ తెలిపింది. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కోవిడ్-19 పరీక్షలు కూడా చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు కరోనావైరస్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చాక, కార్యాలయంలో అన్ని రకాల సెక్యూరిటీ ప్రొటోకాల్స్ ను పాటిస్తూ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. దీనికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారులాక్ డౌన్ కు సంబంధించిన నిబంధనలను సడలించాక ఎన్నో కంపెనీలు ఆరెంజ్, గ్రీన్ జోన్లలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒప్పో కూడా ఒకటి. అయితే మనదేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఇవాళ నుంచి ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసర వస్తువులు కాని వాటిని కూడా డెలివరీ చేయడం ప్రారంభించాయి. దీంతో మనదేశంలో ఈ-కామర్స్ మార్కెట్ ద్వారా స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను డెలివరీ చేయడం కూడా ప్రారంభించాయి. దాదాపు 50 రోజుల తర్వాత ఈ తరహా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వినియోగదారుల నుంచి ఆర్డర్లను తీసుకోవడం కూడా ప్రారంభించడంతో డిమాండ్, సప్లై చైన్ ను బ్యాలెన్స్ చేసేందుకు ఒప్పో వీలైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభిస్తే మంచిది.

Related Posts