జూలై 1 నుంచి సీబీఎస్ ఈ ఎగ్జామ్స్
న్యూఢిల్లీ, మే 18,
కరోనా,లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన విధించారు. అలాగే శానిటైజర్స్ వెంట తీసుకురావాలని సీబీఎస్‌ఈ తెలిపింది.అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించరని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలోని 3 వేల సీబీఎస్ఈ పాఠశాలలను మూల్యాంకన కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు.దాదాపు 1.5 కోట్లకు పైగా జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా లాక్‌డౌన్ కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పరీక్షలు తొలుత వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
పరీక్ష తేదీలు:
జులై 1 - హోమ్ సైన్స్
జులై 2 - హిందీ ఎలక్టివ్, హిందీ కోర్
జులై 3 - ఫిజిక్స్
జులై 4 - అకౌంటెన్సీ
జులై 6 - కెమిస్ట్రీ
జులై 7 - ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
జులై 8 - ఇంగ్లిష్ ఎలక్టివ్, ఇంగ్లిష్ కోర్
జులై 9 - బిజినెస్ స్టడీస్
జులై 10 - బయో టెక్నాలజీ
జులై 11 - జియోగ్రఫీ
జులై 13 - సోషియాలజీ
జులై 14 - పొలిటికల్ సైన్స్
జులై 15 - మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, బయాలజీ