YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రంపై కేసీఆర్ గుర్రు

కేంద్రంపై కేసీఆర్ గుర్రు

కేంద్రంపై కేసీఆర్ గుర్రు
హైద్రాబాద్, మే 18,
కరోనావైరస్, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేని స్థితిలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రులు ఆర్థిక సాయం కోసం కేంద్రం వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు రుణాలు తెచ్చుకునే పరిమితిని కేంద్రం పెంచింది. ఇప్పటి వరకూ జీఎస్‌డీపీలో 3 శాతం రుణాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉండగా.. దాన్ని 5 శాతానికి పెంచారు. కానీ దీనికి కూడా నిబంధనలు విధించారు.పెంచిన 2 శాతం ప్రకారం రూ.20 వేల కోట్లను రుణాల రూపంలో సమీకరించుకోవడానికి తెలంగాణ సర్కారుకు అవకాశం ఉంది. కానీ ఈ 2 శాతంలో నాలుగో వంతు అంటే 0.5 శాతం మాత్రమే ఎలాంటి షరతులు లేకుండా రుణ సమీకరణ చేయొచ్చు. మిగతా 1.5 శాతంలో 1 శాతం రుణాలను నాలుగు విడతల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా అనేక షరతులున్నాయి.స్థానిక పట్టణ సంస్థలకు నిధుల కేటాయింపు, వన్ నేషన్ వన్ రేషన్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సంస్కరణలకు.. రుణాలు తీసుకోవడానికి కేంద్రం లంకె పెట్టింది. మిగతా అన్ని అంశాల్లోనూ తెలంగాణ సర్కారు మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ.. విద్యుత్ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యుత్ అనేది పూర్తిగా రాష్ట్రం చేతుల్లో ఉండటానికే ఇష్టపడుతోంది. కానీ కేంద్రం మాత్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. అప్పులు తెచ్చుకోవడానికి కూడా సంస్కరణల పేరిట అడ్డు తగులుతుండటం పట్ల కేసీఆర్ సర్కారు గుర్రుగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు కేంద్రం తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చుకోవడానికి కూడా ఈ నిబంధనలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంస్కరణలు మంచివే కానీ తొలి నాళ్లలో వాటిని అమలు చేయడం కష్టంతో కూడుకున్న పని అని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

Related Posts