YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం సినిమా తెలంగాణ

ఆగస్టు తర్వాతే సినిమా ధియేటర్లు

ఆగస్టు తర్వాతే సినిమా ధియేటర్లు

ఆగస్టు తర్వాతే సినిమా ధియేటర్లు
హైద్రాబాద్, మే 19,
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని స్తంభించిపోయాయి. కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో సినీ ఇండస్ట్రీపై ప్రభావం పడింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్‌ అన్ని ఆగిపోయాయి, థియేటర్స్‌ సైతం మూత పడ్డాయి. సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులను అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్‌ను మళ్లీ ఓపెన్‌ చేయడం సాధ్యమేనా? వీటి విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ స్పందించారుఈ పరిస్థితుల్లో థియేటర్స్‌ను ఓపెన్‌ చేస్తే సమస్యలు వస్తాయని అన్నారు. థియేటర్స్‌ను ఓపెన్‌ చేసినప్పటికీ కరోనా భయంతో ప్రేక్షకులు రాకపోవచ్చనని తెలిపారు. సామాజిక దూరం పాటించడం కోసం థియేటర్స్‌లోని సీటింగ్‌ విషయంలో మార్పులు చేయాల్సి ఉందన్నారు. మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు సీటింగ్‌ విషయంలో వీలైనంత త్వరగా మార్పులు చేయలన్నారు. జిల్లా స్థాయి థియేటర్స్‌లో సీటింగ్‌లో మార్పులు చేస్తే ఆర్థికంగా ఇబ్బందిపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరో రెండు నుంచి మూడు నెలలపాటు థియేటర్స్‌ను రీఓపెన్‌ చేయడం పట్ల ప్రభుత్వం సానుకూలంగా లేన్నట్టు కనిపిస్తోంది. కొన్ని షరతులతో థియేటర్స్‌ ఓపెన్‌ చేయమని కోరుతున్నారు. ఈ విషయంలో ఇంకొన్ని రోజులు చూద్దామని మరికొందరు అంటున్నారు. షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వడం పట్ల కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తలసాని చెప్పారు.

Related Posts