YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

సెప్టెంబర్‌ నాటికి 3 కోట్ల డోసులు

సెప్టెంబర్‌ నాటికి 3 కోట్ల డోసులు

సెప్టెంబర్‌ నాటికి 3 కోట్ల డోసులు
న్యూఢిల్లీ, మే 19,
కరోనా నిర్మూలన కోసం ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టడంలో నిమగ్నమయ్యాయి. కరోనా వైరస్ అభివృద్ధిపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలు కొనసాగుతున్నాయి.  కరోనా వైరస్‌కు టీకా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాదిలో సెప్టెంబర్‌ నాటికి 3 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను రెడీ చేసే దిశగా బ్రిటన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో, ఇంపీరియల్‌ కాలేజ్‌లో ఈ టీకాకు సంబంధించిన పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయని ఆ దేశ వాణిజ్య మంత్రి అలోక్‌ శర్మ తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌లో హ్యూమన్‌ ట్రయల్స్‌ స్థాయికి పరిశోధనలు చేరుకున్నాయని చెప్పారు. కరోనా నిర్మూలనకు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యే టీకాను రూపొందించడం సాధ్యపడదని అలోక్ శర్మ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, సంస్థలు, పరిశోధకులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరోవైపు ఇతర ఫార్మా కంపెనీలు సైతం కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని పరిశోధనల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మరికొన్ని హ్యుమన్ ట్రయల్స్ వరకు చేరుకున్నట్టు ఆయా పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రావాలంటే కనీసం మరో మూడు నెలలకు పైగా సమయం పట్టేలా కనిపిస్తోంది. కానీ, వాస్తవానికి ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే దానికి అవసరమయ్యే చర్యలను బట్టి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ కరోనా వ్యాక్సిన్ వేగవంతంగా అభివృద్ధి చేసే దశగా బ్రిటన్ అడుగులు వేస్తోంది. ఏడాదిలో సెప్టెంబర్ నాటికి 3 కోట్ల డోసులు సిద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

Related Posts