YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రెండింతలైన మద్యం అమ్మకాలు

రెండింతలైన మద్యం అమ్మకాలు

రెండింతలైన మద్యం అమ్మకాలు
హైద్రాబాద్, మే 19,
రాష్ట్రం నుంచి ఏపీకి లిక్కర్ అక్రమంగా తరలిపోతోంది. ఆ రాష్ట్రంలో లిక్కర్ ధరలు భారీగా పెంచేయడంతో.. సరిహద్దుల్లోని మన జిల్లాల నుంచి లిక్కర్ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా బార్డర్లకు సమీపంలోని వైన్షాపుల్లో అయితే భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఉన్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.లాక్‌‌‌‌ డౌన్‌‌‌‌ తో చాన్నాళ్లు లిక్కర్ షాపులు మూసే ఉన్నాయి. ఇటీవలే కేంద్ర అనుమతుల మేరకు తెరిచారు. ఆదాయం పెంచుకోవడం, లిక్కర్ వినియోగం తగ్గించడం లక్ష్యమని చెప్తూ ఏపీ సర్కారు తొలుత 50 శాతం ధర పెంచింది. తర్వాతి రోజే మరో 25 శాతం కలిపి.. 75 శాతం రేట్లు పెంచింది. తెలంగాణలో సగటున 16 శాతం ధర పెంచారు. దీంతో ఏపీ, తెలంగాణ లిక్కర్‌‌‌‌ రేట్లలో భారీగా తేడా ఏర్పడింది. ఏపీ సర్కారు లిక్కర్ నియంత్రణ కోసం షాపుల సంఖ్యను తగ్గించింది. రాష్ట్రంలో తక్కువ ధరకు దొరకడం, ఎక్కువ అందుబాటులో ఉండటంతో.. ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారు.ఏపీ సరిహద్దుల్లో ఉన్న నల్లగొండ, సూర్యాపేట, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌, వనపర్తి జిల్లాల్లో సరిహద్దులకు దగ్గరగా ఉన్న చోట్ల లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంలో రోజుకు లక్ష నుంచి 2 లక్షల వరకు విక్రయాలు జరిగినచోట్ల ఇప్పుడు రోజూ రూ. 5 లక్షల వరకు లిక్కర్ అమ్ముతోంది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, మట్టపల్లి, దామరచర్ల, వాడపల్లి, అడవిదేవులపల్లి నుంచి లిక్కర్ ఏపీకి తరలుతోంది. ఇటు ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, మీనవోలు, దెందుకూరు, మడుపల్లి, పెనుబల్లి, గద్వాల జిల్లాలోని అలంపూర్‌‌‌‌, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లాలోని కొల్లాపూర్‌‌‌‌, దోమలపెంట, పెంట్లవెల్లిలోని వైన్స్‌‌‌‌ల నుంచీ భారీగా తీసుకెళ్తున్నారు.సరిహద్దుల్లో అన్ని చోట్లా ఈ చెక్పోస్టులు ఉన్నా లిక్కర్ తరలిపోతోంది.

Related Posts