YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆమోనియా గ్యాస్ లీక్…భయాందోళనకు గురైన ప్రజలు

ఆమోనియా గ్యాస్ లీక్…భయాందోళనకు గురైన ప్రజలు

ఆమోనియా గ్యాస్ లీక్…భయాందోళనకు గురైన ప్రజలు
విశాఖపట్నం మే 19
విశాఖపట్నం గ్యాస్ ఘటన మరువక ముందే మలికిపురం మండలంలోని విశ్వేశ్వరాయ పురంలో వెంకటేశ్వరా ఐస్ ఫ్యాక్టరీ లో సోమవారం రాత్రి అమోనియా గ్యాస్ లీక్ అయింది. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న రెవెన్యూ పోలీస్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలాన్నికీ తరలి వచ్చి పరిస్థితి చక్కదిద్దారు. సుమారు 500 మీటర్ల లోపు ఉన్న ఈపరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. అయితే అప్పటికే గ్యాస్ లీక్ అవడంతో అధికారులు అప్రమత్తమై వాల్ మూసివేశారు. గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చినప్పటికీ బయట ఉండే కూలింగ్ మైస్ లో ఉండే గ్యాస్ పూర్తిగా బయటకు రావటానికి కొద్ది సమయం పట్టింది.అయితే అప్పటికే అధికారులు తక్షణ చర్య ప్రజలను ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.అయితే ఈ గ్యాస్ట్రిక్ వల్ల కళ్ళు మంటలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో అధికారులు సిబ్బంది ఒకింత అసౌకర్యానికి గురయ్యారు.అప్పటికే సంఘటన స్థలానికి అమలాపురం డిఎస్పి షేక్ మాసూంబాషా,సిఐ సురేష్ బాబు,తాసిల్దార్ నరసింహారావు, ఘటనాస్థలానికి చేరుకుని అధికారులతో చర్చించారు. ఫైర్ సిబ్బంది సహకారంతో ప్రయోగాన్ని చెయించారు.దీంతో కొంత మేర గ్యాస్ ఒత్తిడి అదుపులోకి వచ్చిందని డిఎస్పీ తెలిపారు.అంతేకాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఒక డాక్టర్ బృందాన్ని లను సిద్ధం చేశారు.ఎస్ఐ సురేష్ ఆర్ఐ రెవిన్యూ సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమాచారం అందుకున్న అమలాపురం ఎంపీ చింతా అనురాధ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆర్డీవో భవానీశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు..

Related Posts