షాద్ నగర్ లో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్ మే 19,
సుమారు రెండు నెలల తరువాత ఎట్టకేలకు షాద్ నగర్ లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం 6 గంటల నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ప్రభుత్వ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆర్టీసీ కార్యకాలాపాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఆటోలు, క్యాబ్లు, సెలూన్లు, ఆర్టీసీ బస్సులు నడపవచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అందుకనుగుణంగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో మొత్తం 110 బస్సులు ఉన్నాయి. ఇందులో 67 ప్రభుత్వ, 43 ప్రయివేట్ బస్సులు ఉన్నట్టు డిపో మేనేజర్ సత్తయ్య తెలిపారు. షాద్ నగర్ డిపో నుండి హైదరాబాద్, చేవెళ్ల, ఆమన్ గల్ రూట్లలో ప్రస్తుతం బస్సులను నడుపుతున్నట్టు డీఎం సత్తయ్య స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు, లాంగ్ సర్వీసుల సౌకర్యం లేదని పేర్కొన్నారు. బస్సులో మున్సిపాలిటీ ద్వారా సానిటైజ్ చేయించారు. ఉదయం ఎనిమిదిన్నర వరకు డిపో నుండి 14 బస్సులు బయటికి వెళ్లాయి. కరోనా వైరస్ నివారణకు శానిటైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తూనే ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిబంధన విధించారు. దీంతో మాస్కులు ఉన్నవారినే బస్సులోకి అనుమతించారు.