YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్ మే 19
హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం 6 గంటల నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ కార్యకాలాపాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఆటోలు, క్యాబ్లు, సెలూన్లు, ఆర్టీసీ బస్సులు నడపవచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అందుకనుగుణంగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.కరోనా వైరస్ నివారణకు శానిటైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తూనే ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిబంధన విధించారు. దీంతో మాస్కులు ఉన్నవారినే బస్సులోకి అనుమతిస్తున్నారు. కరీంనగర్ వైపు నుంచి రాజధాని నగరానికి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సులను హయత్నగర్ వరకు, మహబూబ్నగర్ వైపు నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకు, వరంగల్ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ చౌరస్తా వరకు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోల బస్సులు పహాడీ షరీఫ్ వరకు అనుమతించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. బస్సు సర్వీసులు రాత్రి ఏడు గంటలకే నిలిపివేస్తారు. ఒకవేళ అప్పటికే టిక్కెట్లు జారీ చేస్తే ఎనిమిది గంటల వరకు అనుమతి ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు.

Related Posts