ఉత్తరాది రాష్ట్రాల్లో, హైదరాబాద్‌లో దోపిడీలకు పాల్పడి హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో హల్‌హల్ చేస్తోంది. కర్నూలు పట్టణంలోని న్యూకృష్ణానగర్‌లో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. రూ.50 వేలు, రెండు తులాల బంగారం చోరీ చేశారు. ఓ ఇంట్లో వస్తువులను చెడ్డీ గ్యాంగ్ తగులబెట్టారు. చెడ్డీగ్యాంగ్ అంటేనే దడ పుట్టించే విధంగా దోపిడీలుంటాయి. అవసరమైతే దాడులకు పాల్పడడానికి ఏ మాత్రం వెనుకాడరు. వీరు హైదరాబాదులోనే మకాం ఉంటూ అనుకూలమైన ప్రదేశాలను గమనించి అక్కడ ముందుగానే రెక్కీ నిర్వహించి దోపిడీలకు పాల్పడతారు. చెడ్డీలు, బనియన్లు వేసుకుని దోపిడీలకు పాల్పడే ఈ గ్యాంగ్‌ను ాకబ్జా బనియన్ గ్యాంగ్‌్ణ అని కూడా పిలుస్తారు. దోపిడీ జరిగే ప్రయత్నంలో ఎవరైనా అడ్డుకుని పట్టుకుంటే జారిపోయేందుకు శరీరానికి ఆయిల్, జారిపోయే మట్టిలాంటివి పూసుకుంటారు.