YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రంగనాయకమ్మమీద కేసు

రంగనాయకమ్మమీద  కేసు

రంగనాయకమ్మమీద  కేసు
గుంటూరు, మే 19,
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారంటూ సీఐడీ అధికారులు గుంటూరు నగరానికి చెందిన రంగనాయకమ్మ (66) అనే వృద్ధురాలికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి రంగనాయకమ్మ స్పందించారు. విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి తన స్నేహితుడు కొన్ని పాయింట్స్ పెట్టారని, గ్యాస్, దాని క్వాలిటీ గురించి, పరిహారం తదితర వాటి గురించి సోషల్ మీడియాలో పెట్టారని.. అది అందరూ చదివితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ మేటర్‌ను ఆయన అనుమతితో కాపీ చేసి (షేర్ ఆప్షన్ ద్వారా) ఫేస్‌బుక్‌లో పేస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. జాతీయ మీడియాలో వచ్చిన అంశాలనే తన స్నేహితుడు తెలుగులోకి అనువదించి పెట్టారని, ఇది అందరికీ అర్థమవుతుందని తాను మే 12వ తేదీన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినట్లు రంగనాయకమ్మ పేర్కొన్నారు. అయితే దీనిపై తనపై ఐపీసీ సెక్షన్ 41ఏ కింద కేసు పెట్టారని, ఈ నెల 21న తనను సీఐడీ ఆఫీసుకు రమ్మన్నారని చెప్పారు.ప్రజాస్వామ్యంలో కనీసం తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేకపోతే మన గురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదని రంగనాయకమ్మ అభిప్రాయపడ్డారు. తనకు వచ్చిన సమాచారాన్నే షేర్ చేశానన్నారు. సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని తనకొచ్చిన పోస్ట్‌ను పార్వర్డ్ చేసినందుకు తనపై 41 ఏ సెక్షన్ కింద సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. తాను రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పెట్టలేదని, కేవలం ప్రజలకు సమాచారం అందించేందుకే సీనియర్ సిటిజన్‌గా తన వంతు బాధ్యతగా పోస్టు చేశానని వ్యాఖ్యానించారు.

Related Posts